తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకట రమణ గారు ఈరోజు ఖమ్మం (Khammam, Telangana) లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఇష్టంతో కష్టపడి చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని అమెరికా లాంటి దేశాలలో ఉన్నత స్థాయిలో మెరుగైన జీవితాన్ని గడుపుతున్న మన తెలుగు రాష్ట్ర ప్రముఖులందరూ మన ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే అన్నారు.
మంచి లక్ష్యంతో చదివే విద్యార్థులకు తానా ఫౌండేషన్ (TANA Foundation) అనేక రకాలుగా ఉన్నత వారి విద్యకు సహాయ సహకారాలు అంద జేస్తుందని, ఏ ఒక్క నిరుపేద విద్యార్ధికి వారి పేదరికం వారు చదువుకు అడ్డుకారాదని తానా సభ్యులందరూ ఒక సదాశయంతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.
ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న వారికి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, ఇతర సరంజామా అందజేశారు. రోటరీ నగర్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పాండురంగాపురం ఉన్నత పాఠశాలలో 76 మందికి వెలుగుమట్ల ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందారు.
ఆయా పాఠశాల (Government Schools) ప్రధానోపాధ్యాయులు మధుగారు, స్వర్ణలత గారు, రవి కిషోర్ గారు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ (Venkata Ramana Yarlagadda) గారికి ధన్యవాదాలు తెలియజేశారు. గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ గారు, బండి నాగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తానా (Telugu Association of North America) ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకట రమణ గారిని అభినందించారు.