Connect with us

Donation

పేరుకు తగ్గట్టే ఆదరణనిస్తున్న ‘తానా ఆదరణ’, వికలాంగురాలికి మూడు చక్రాల స్కూటర్ పంపిణీ

Published

on

‘తానా ఆదరణ’ కార్యక్రమం పేరుకు తగ్గట్టే వివిధ వర్గాల పేదలకు ఆదరణనిస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి ఆసరాగా నిలుస్తుంది. ఇందులో భాగంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగురాలు ఫౌజియా కి మూడు చక్రాల స్కూటర్ పంపిణీ చేసారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర గ్రామ వాసి ఫౌజియా బిఈడి గ్రాడ్యుయేట్ అవ్వడం గొప్ప విశేషం.

దీనికి దాతలైన నరేన్ కొడాలి, రాజా కసుకుర్తి, సురేష్ పుట్టగుంట, మహమ్మద్ షఫికుల్, విక్రమ్ ప్రభల, సొహైల్ మహమ్మద్, సుధాకర్ గణపతి, ఫైజుర్ రహ్మాన్ మరియు అయేషా లను తానా ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భగా ఫౌజియా మాట్లాడుతూ అడిగిన వెంటనే తనకు సహాయం చేసిన తానా సభ్యులకు కృతఙ్ఞతలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected