Connect with us

Students

TANA @ Charlotte: బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమంలో భాగంగా 300 మందికి స్కూల్‌ బ్యాగ్‌ ల పంపిణీ

Published

on

Charlotte, North Carolina: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్‌ పేరిట చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.

ఈ సంవత్సరం కూడా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమాన్ని తానా నాయకులు చేపట్టారు. ఛార్లెట్‌ (Charlotte) లో ఆగస్టు 20వ తేదీన హార్నెట్ నెస్ట్ ఎలిమెంటరీ స్కూల్‌ (Hornets Nest Elementary School) లోని పేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీ చేశారు. ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమం కింద దాదాపు 300కు పైగా బ్యాగ్‌ లను పిల్లలకు అందజేశారు.

ఇందులో క్రేయాన్స్‌, ఎరేజర్స్‌, పెన్సిల్‌, షార్పనర్స్‌, పెన్నులు తదితర వస్తువులను కూడా కలిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛార్లెట్‌ లోని తానా (TANA) నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

తానా అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రవి వడ్లమూడి (Nani Vadlamudi), తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్‌ నాగమల్లేశ్వర పంచుమర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ ‌ఠాగూర్‌ మల్లినేని (Tagore Mallineni), తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ మాధురి ఏలూరి, తానా రైతుకోసం చైర్ రమణ అన్నే పాల్గొన్నారు.

తానా బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమానికి (TANA Backpack Program) తమ స్కూల్‌ ని ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీ చేసినందుకు టీచర్లు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లల తల్లితండ్రులు కూడా తానాకు తమ అభినందనలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected