ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) న్యూయార్క్ (New York) టీం అధ్వర్యంలొ Wyandanch యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ లొ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేయటం జరిగింది. రాజా కసుకుర్తి (Raja Kasukurthi) ఉదార మద్దతుతో దాదాపు 100 మంది స్కూల్ విధ్యార్ధులకు బ్యాక్ ప్యాక్లూ మరియు స్కూల్ సామగ్రిని అందించారు.
అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali) నాయకత్వంలొ కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) సహకారం తో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తొందని తానా ప్రథినిధులు తెలియచేసారు.
ఈ కార్యక్రమం విజయవంతం అగుటకు తానా న్యూయార్క్ (New York) ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు (Srinivas Bharthavarapu), తానా ప్రోగ్రాం సమన్వయకర్తలు సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, ప్రసాద్ కోయి, శ్రీనివాస్ నాదెళ్ల (Srinivas Nadella) ఎంతో కృషి అందించారు.
తానా (Telugu Association of North America – TANA) కిడ్స్ సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆశ్రిత కోయి, శరన్ సాయి భర్తవరపు, గీతికా చల్ల, రజిత్ రెడ్డి, రమ్యరెడ్డి, మరియు లోహితాక్ష సాయి నాదెళ్ల ఈ కార్యక్రమం విజయవంతం అగుటకు తోడ్పాటు అందించారు.
తానా న్యూయార్క్ (New York) ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి తానా చేసే సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా Wyandanch యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ స్కూల్స్, స్థానిక స్కూల్ అధికారులు, టీచర్లు మాట్లాడుతూ, కమ్యూనిటీకి తానా (Telugu Association of North America – TANA) చేస్తున్నసేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమం (TANA Backpack Project) కింద తమ స్కూల్‌ను ఎంపిక చేసి పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేసినందుకు వారు తానా ప్రథినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలు, వారి తల్లితండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.