ప్రతి ఏటా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా‘ బ్యాక్‌ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలో కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా (TANA) ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
ఈ సంవత్సరం కూడా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని తానా నాయకులు (TANA Leaders) చేపట్టారు. ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఆగస్టు 22వ తేదీన క్లియర్ క్రీక్ ఎలిమెంటరీ స్కూల్ (Clear Creek Elementary School) లోని పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేశారు.
అలాగే బ్రన్స్ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూల్ (Bruns Avenue Elementary School) లోని పిల్లలకు కూడా స్కూల్ బ్యాగ్ లను అందజేశారు. ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమం (TANA Backpack) కింద దాదాపు 300కు పైగా బ్యాగ్ లను పిల్లలకు (Kids) అందజేశారు.
ప్రతి బ్యాగ్ లో క్రేయాన్స్, ఎరేజర్స్, పెన్సిల్, షార్పనర్స్, పెన్నులు తదితర వస్తువులను కూడా కలిపి అందజేశారు. ఈ తానా (Telugu Association of North America – TANA) కార్యక్రమంలో ఛార్లెట్ (Charlotte, North Carolina) లోని తానా నాయకులు పలువురు పాల్గొన్నారు.
తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగమల్లేశ్వర పంచుమర్తి (Naga Panchumarthi), తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి (Kiran Kothapalli), పట్టాభి కంఠమనేని, రమణ అన్నే, సతీష్ నాగభైరవ, పార్ధ సారధి గునిచెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ.. కమ్యూనిటీకి చేస్తున్న తానా సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా (TANA) బ్యాక్ ప్యాక్ కింద తమ స్కూల్ ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.