Connect with us

Felicitation

డిసెంబర్ 16న శిల్పకళా వేదికలో కళారాధన, తెలుగు సినీ లెజెండ్స్ కు పురస్కారాలు: TANA Chaitanya Sravanti

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో కళారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన లెజెండ్స్ కు పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురష్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి మరియు తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్ర సునీల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు (Padmasri Shobha Raju) అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ మరియు అమెరికా కు చెందిన 300 కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

దీనికి సంబంధించి పలు తెలుగు సినీ ప్రముఖులను ఆహ్వానించిన వారిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి మరియు తానా ఫౌండేషన్ సెక్రటరి వల్లేపల్లి శశికాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected