Connect with us

Picnic

చక్కని కాలక్షేపాన్నిచ్చిన అమెరికా రాజధాని ప్రాంత వనభోజనాలు @ Washington DC – GWTCS & TANA

Published

on

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) మరియు తానా (Telugu Association of North America – TANA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం సుమారు 800 పాల్గొనగా దిగ్విజయంగా ముగిసింది. వందలాది మంది ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

ఎన్నో ప్రత్యేకతలతో కూడి అన్ని వయస్సుల వారికి ఆటలు, వినోదం, పిల్లల కోసం స్నో కోన్స్, కాటన్ క్యాండీ, పాప్‌కార్న్, మహిళల (Women) కోసం లైవ్ కుకింగ్ మరియు పోటీలతో ఇంకా ఎన్నో రుచికరమైన వంటకాలు మరియు వినోదంతో ఆసాంతం ఆహ్లాదకరంగా, సంతోషంగా రోజంతా గడిపారు.

ఉదయం 8 గంటల నుండే లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ పార్కు (Lake Fairfax Park) లో ముందుగా పూరి, చికెన్, రాగి సంకటి ఇలా సంప్రదాయ వంటలను వండటం ఆరంభించి మధ్యాహ్నానికి వందలాదిమందికి రుచికరమైన విందును అందించి ఆటపాటలతో, పోటీలతో పూర్తి కాలక్షేపాన్ని అందించారు.

మహిళలకు నిర్వహించిన వంటల పోటీలు (Games), మాతృభాషను ఈ తరం చిన్నారులకు అందించే పాఠశాల (TANA Paatasala) కార్యక్రమాలు పాల్గొన్నపెద్దలు, తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. వారంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రోజంతా సందడిగా చిన్నారుల కేరింతలతో సంతోషంగా గడిపామని ఇదే ఐక్యతను కొనసాగిస్తూ అందరూ కలిసి మెలిసి ఉండాలని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్లకు నిర్వాహకులు తానా (TANA) అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali), పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) తమ కృతఙ్ఞతలు తెలిపారు. తానా, GWTCS కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected