
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా 5కె రన్ మరియు వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మనం పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ 5కె రన్ గత ఆదివారం నాడు ఉత్తర కరోలినా రాష్ట్రం లోని ర్యాలి లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ర్యాలితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ తమవంతు విరాళాలను తానా సేవాకార్యక్రమాలకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ సమన్వయకర్త వేమన మల్లి మరియు పూర్ణచంద్ర, కాకర్ల సురేష్ తదితరులు నిర్వహించారు.



