ఆగష్టు 19న అట్లాంటా నగరంలోని న్యూటౌన్ పార్క్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే వాక్ నిర్వహించారు. మనం పుట్టి పెరిగిన స్వంత ఊరి ప్రజల సేవ కోసం తానా ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకి పేర్లు నమోదు చేసుకున్నవారికి బిబ్స్, టీషర్ట్స్ ఇవ్వడంతో కార్యక్రమం మొదలయింది. ముందుగా బాంబే జామ్ డాన్స్ టీం నుంచి త్రిపుర మంచి ఎనర్జిటిక్ నృత్యాలతో డాన్స్ చేయించగా అందరూ వార్మ్ అప్ అయ్యారు. తదనంతరం పిల్లలకోసం ఏర్పాటుచేసిన 1కే వాక్ మొదలుపెట్టడంతో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. తర్వాత పెద్దల కోసం ఏర్పాటుచేసిన 5కే వాక్ లో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పోటాపోటీగా నడవడం గమనార్హం.
తదనంతరం బాలలు, మహిళలు మరియు పురుషుల విభాగాలలో మొదటి పది మంది విజేతలకు అట్లాంటా పెద్దల చేతులమీదుగా మెడల్స్ మరియు గిఫ్ట్ కార్డ్స్ అందించారు. సేవతోపాటు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడే ఈ 5కే వాక్ ని నిర్వహించిన తానా కార్యవర్గ సభ్యులు వినయ్ మద్దినేని, భరత్ మద్దినేని, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, రాజు మందపాటి, నగేష్ దొడ్డాక, వెంకీ గద్దె, రామ్ మద్ది, మురళి కిలారు, ఆదిత్య గాలి, భరత్ అవిర్నేని, రాజశేఖర్ చుండూరి, రాజేష్ జంపాల తదితరులను అందరూ ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
వాక్ తదనంతరం శ్రీనివాస్ నిమ్మగడ్డ సారధ్యంలో సంక్రాతి రెస్టారెంట్ వారు అందించిన తేనీటి విందు అమోఘం. చివరిగా తానా అడ్ హాక్ కమిటీ సభ్యులు వెంకీ గద్దె, ఆడియో మరియు ఫోటోగ్రఫీ సేవలందించిన క్రిస్టల్ క్లియర్ ప్రొడక్షన్స్ దేవానంద్ కొండూరు, వేదికను అందించిన న్యూటౌన్ పార్క్ నిర్వాహకులు, సంక్రాoతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ, స్థానిక సమర్పకులు డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధినేత శ్రీనివాస్ లావు, వాలంటీర్లు మరియు ఈ వాక్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.