Connect with us

Conference

ఊపందుకున్న తానా 23వ మహాసభల ఏర్పాట్లు, వివరాలు ఇవిగో

Published

on

అమెరికాలో తెలుగు వారి గుండె చప్పుడు అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ ప్రవాసంలో ఇటు సేవాకార్యక్రమాలతోపాటు అటు మన తెలుగువారి సంస్కృతీసంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎప్పుడూ ముందుంటుంది.

ఇందులో భాగంగా అమెరికాలో తెలుగువారి అతిపెద్ద వేడుక అయినటువంటి తానా (TANA) మహాసభలు ఈసారి ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే.

అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న ఈ తానా 23వ మహాసభలకు సంబంధించి పలు నగరాల్లో కిక్‌ ఆఫ్‌ మీటింగ్స్ మరియు ఫండ్రైజర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క మహాసభల కమిటీలు కూడా తమ పరిధిలో సమావేశమవుతూ ఏర్పాట్ల పనులపై దృష్టి సారిస్తున్నారు.

ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వెండర్ బూత్స్, సావెనీర్ ప్రకటనలు, ధీమ్ తానా (DhimTANA), పలురకాల క్రీడలు వంటి వాటికి కాన్ఫరెన్స్ వెబ్సైట్ లో రెజిస్ట్రేషన్స్ ప్రారంభించారు. అలాగే తానా మహాసభల (Conference) కు విచ్చేయనున్న అతిరథమహారధుల వివరాలను ఇప్పటికే ప్రకటించారు.

తెలుగు ఆడపడుచుల ఆట పాటలు, ఆత్మీయుల పలకరింపులు, అతిరథ మహారథులు, కవులు, కళాకారులతో వీనుల విందైన సంగీతం, ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, అంగ రంగ వైభవంగా జరగబోయే 23వ తానా మహా సభలకు ఇదే మా ఆత్మీయ సాదర స్వాగతం అంటున్నారు తానా నాయకులు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తానా సాహిత్య వేదిక చిత్ర, సంగీత, అవధానం, నవల, పుస్తకావిష్కరణ, పద్య సౌగంధం, బాలల సాహిత్యం వంటి ప్రక్రియలతో యువత మరియు అభిరుచిగల సాహితీ ప్రియులు అందరినీ సాహితీ లోకంలో విహరింపజేయగల ప్రఖ్యాత రచయితలు, కవులు, అవధానులు మరియు వక్తలను మీ ముందుకు తీసుకువస్తున్నారు.

అమెరికా, కెనడా మరియు ఉభయ తెలుగు రాష్టాలలో వున్న విశిష్ఠ అతిథులు, నృత్య, సంగీత, సినీ కళాకారులు, సాహితీ వేత్తలు మరియు తెలుగు బంధువులు అందరికీ అత్యంత వైభవోపేతంగా అమెరికాలో అతిథులకు సోదర ప్రేమ అందించే నగరంగా పేరుగాంచిన ఫిలడెల్ఫియాలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

రెజిస్ట్రేషన్స్, టికెట్స్ తదితర వివరాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ‘తానా’ 23వ మహాసభల (23rd TANA Conference) వెబ్సైట్ www.NRI2NRI.com/TANA23rdConferenceInPhiladelphia ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected