Connect with us

Conference

తానా మహాసభల సమన్వయ కమిటీల భేటీ, ఏర్పాట్ల పురోగతిపై నివేదికలు సమర్పణ

Published

on

ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం, నారిస్ టౌన్ (Norristown) లో జూన్ 10వ తేదీన, ప్రతిష్టాత్మక తానా (Telugu Association of North America – TANA) 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.

జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోయే మహాసభల (Conference) ను జయప్రదం చేసేందుకు కార్యాచరణ, మహాసభలకు హాజరు అయ్యే అతిధుల ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయా కమిటీల సభ్యులు వారి ప్రణాళికలను వివరించారు.

ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా ఇతరాత్ర రాష్ట్రాలనుండి సుమారు మూడు వందలపైగా మహాసభల (Convention) కమిటీ సభ్యులు హాజరై వారి కమిటీల పురోగతి నివేదికలు సమర్పించారు. కమిటీల పనితీరు, పురోగతి నివేదికలపై అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు కన్వీనర్ రవి పొట్లూరి హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి, మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశి కోట, తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ జానీ నిమ్మలపూడి, లక్ష్మి దేవినేని, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, ఫౌండేషన్ ట్రస్టీస్ సుమంత్ రామిశెట్టి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా ప్రాంతీయ ప్రతినిధులు సునీల్ కోగంటి, సాయి బొల్లినేని, కమిటీ సభ్యులు శ్రీనాథ్ కోనంకి, విశ్వనాథ్ కోగంటి, కిరణ్ కొత్తపల్లి తదితరులు పాల్గున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected