Connect with us

Associations

అట్లాంటా తెలుగు సంఘం తామా చదరంగం పోటీలు

Published

on

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ చదరంగం పోటీలు ఏప్రిల్ 14న అట్లాంటాలోని కమ్మింగ్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను హోమ్, ఆటో, లైఫ్ ఇన్సూరెన్సు సేవలందించే ఆల్ స్టేట్ లైసెన్స్డ్ ఏజెంట్స్ రాజేష్ జంపాల, శ్రీనివాస్ రాయపురెడ్డి ‘వుయ్ కేర్’ తరపున సమర్పిస్తున్నారు. స్థానిక బిగ్ క్రీక్ ప్రాధమిక పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోటీలలో అండర్ 1200, అండర్ 800, అండర్ 400 రేటింగ్ విభాగాలలో మరియు రేటింగ్ లేని విభాగంలో కూడా బహుమతులు అందజేయబడును. ఇది 4 రౌండ్ స్విస్ స్టైల్ టోర్నమెంట్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెజిస్ట్రేషన్స్ కొరకు తామా వెబ్సైటు ను సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected