తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ సంక్రాంతి సంబరాలు జనవరి 20, శనివారం రోజున నిర్వహిస్తున్నారు. సురేష్ బండారు కార్యవర్గ అధ్యక్షునిగా, శ్రీనివాస్ ఉప్పు బోర్డ్ ఛైర్మన్ గా జనవరి 1 నుంచి 2024 సంవత్సరానికి గాను బాధ్యతలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
వీరి ఆధ్వర్యంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారుచేశారు. అందరికీ అనువుగా ఆల్ఫారెటా (Alpharetta) పట్టణంలోనిస్థానిక దేశానా మిడిల్ స్కూల్లో (Desana Middle School) మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ గాయని ఉష (Tollywood Singer Usha) మరియు గాయకులు ప్రవీణ్ (Singer Praveen) చక్కని పాటలతో అలరించనున్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి పళ్ళు, షాపింగ్ స్టాల్ల్స్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి.
అలాగే సాంప్రదాయ తెలుగింటి పండుగ భోజనం, ఆర్ట్ కాంపిటీషన్ (Art Competition), పిల్లలకు గాలిపటాలు, గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులు, ఫ్యాషన్ షో (Fashion Show) వంటి మరెన్నో ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు తామా (TAMA) సంక్రాంతి సంబరాలలో చాలానే ఉన్నాయి.
ఈ అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్, వివిధ పోటీలు, ఆర్టిస్ట్స్ తో మీట్ అండ్ గ్రీట్ వంటి రెజిస్ట్రేషన్స్ మరియు టికెట్స్ కొరకు www.NRI2NRI.com/TAMA Sankranthi 2024 Registrations ని సందర్శించండి.
జనవరి 14 లోపు టిక్కెట్స్ కొంటే ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ (Early Bird Discount) లభించును. మరిన్ని వివరాలకు ఫ్లయర్స్ చూడండి లేదా తామా (Telugu Association of Metro Atlanta) కార్యవర్గ సభ్యులను లేదా బోర్డు సభ్యులను సంప్రదించండి.