Connect with us

Patriotism

భారత సైన్యం, వైమానిక దళంలో సేవలందించిన వారి సమక్షంలో Republic Day వేడుకలు @ TAMA Office in Alpharetta, Georgia

Published

on

Alpharetta, Georgia: అమెరికా లోని జార్జియా రాష్ట్రం, ఆల్ఫారెటా సిటీ లో జనవరి 26వ తేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు భారత దేశ 76వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోర్డు డైరెక్టర్ సాయిరామ్ కారుమంచి అందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా 16 సంవత్సరాలు వైమానిక దళం లో పని చేసి దేశ సంరక్షణ లో భాగంగా కార్గిల్ యుద్ధం (Kargil War) లో మరియు ఆపరేషన్ పరాక్రమ్ లో పనిచేసిన దేవ్ రాపూరి గారు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ… మాతృ భూమి పై మక్కువ పెంచుకోవాలని, మన దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పారు.

ఈ వేడుకకి విచ్చేసిన మరొక ముఖ్య అతిధి నవనీత్ అగురు గారు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. నవనీత్ అగురు గారు భారత సైన్యంలో 13.5 సంవత్సరాలు పనిచేసి మేజర్ (Major) హోదాను పొందారు. అతిధులిద్దరినీ TAMA చైర్మన్ రాఘవ తడవర్తి (Raghava Tadavarthi) మరియు TAMA అధ్యక్షులు రూపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) శాలువా కప్పి, పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకకు తరలి వచ్చిన ప్రవాస భారతీయులకు ముఖ్య అతిధులు, Telugu Association of Metro Atlanta అధ్యక్షులు రూపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవ్ రాపూరి గారు మరియు నవనీత్ అగురు గారు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందనం చేయగా అందరూ భారత దేశ జాతీయ గీతం ఆలపించి తమ గౌరవాన్ని తెలియజేసారు.

భారత దేశ పతాకం (Indian flag) తోపాటుగా అమెరికా దేశపు పతాకాన్ని(American flag) కూడా ఆవిష్కరించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వానికి (Unity in Diversity) ప్రతీకగా ఈ వేడుకకు ప్రాంతీయ, జాతీయ ప్రవాస భారతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా గానవాహిని పాఠశాల వారి గాయనీమణులు (వాహిని & వారి గాన బృందం) దేశభక్తి గీతాలు ఆలపించారు. యశ్వంత్ జొన్నలగడ్డ (Yashwanth Jonnalagadda) గారు మాట్లాడుతూ… మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందివ్వాలంటే తెలుగు భాష ను కాపాడుకోవాలని అన్నారు.

తమ పిల్లలను సిలికాన్ ఆంధ్ర (Silicon Andhra) వారు నిర్వహించే మనబడి (ManaBadi) తెలుగు తరగతులలో చేర్పించాలని తల్లితండ్రులకు పిలుపునిచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకకు దాదాపు 150 కి పైగా ప్రవాస భారతీయులు హాజరై తమ దేశభక్తిని చాటుకొన్నారు. వచ్చిన పిల్లలకు, అతిధులకు తామా వారు చాక్లేట్లు, తేనీరు, అల్పాహారం సమకూర్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు రూపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli), శ్రీనివాస్ ఉప్పు, రాఘవ తడవర్తి, శేఖర్ కొల్లు, రవి కల్లి, ప్రియ బలుసు, ఇన్నయ్య ఎనుముల, తిరుమలరావు చిల్లపల్లి, సునీత పొట్నూరు, శ్రీనివాసరావు రామనాధం, శశి దగ్గుల, యశ్వంత్ జొన్నలగడ్డ, కృష్ణ ఇనపకుతిక, హర్ష, సాయిరాం కారుమంచి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల మొదలగువారు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected