Connect with us

Associations

1700 మందికి పైగా పాల్గొన్న ‘తామా’ దసరా బతుకమ్మ వేడుకలు అదరహో

Published

on

సెప్టెంబర్ 28న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దసరా మరియు బతుకమ్మ వేడుకలు ధూంధాంగా జరిగాయి. 1700 మందికి పైగా పాల్గొన్న ఈ వేడుకలను గోదావరి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ , అమెరిన్డ్ సోలుషన్స్ మరియు డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సమర్పించారు.

ప్రపంచమంతా నివసిస్తున్న తెలుగువారు అత్యంత విశిష్టమైన ఈ బతుకమ్మ పండుగను బాధ్రపద మాసంలో జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల తెలుగు వారిని ఆకట్టుకొంటోంది. ఏడు వరుసలలో రంగు రంగుల పూలను పేర్చి, పసుపుతో గౌరమ్మను బతుకమ్మ పైన పెట్టి రెండు ఊదిబత్తులను పెడతారు. అన్ని బతుకమ్మలను ఒక ప్రాంగణంలో పెట్టి మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో ఆడుతూ పాడుతూ కుడివైపు నడుస్తూ వుంటారు.

సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఇండియా నుండి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ జానపద గాయకులు డాక్టర్ శ్రీనివాస్ లింగా గారు జానపద పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ గారు రాయలసీమ, కోస్తా ఆంధ్ర ఇంకా తెలంగాణా ప్రాంతాలలోని యాసలతో పాటలు వినిపించడం కార్యక్రమానికే ఒక వన్నె తెచ్చింది. బతుకమ్మ ఆటకు ముందు ప్రేక్షకులకు ఓక ప్రశావళి నిర్వహించి గెలిచినవారికి బహుమతులను అందచేశారు.


బతుకమ్మ ఆటను దాదాపు 500 మహిళలు 100 పిల్లలు లింగా గారి పాటలతో రెండు గంటల పాటు ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల మరియు గీత వేదుల న్యాయమూర్తులుగా జరిగిన బతుకమ్మ పోటీలలో విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరు గార్లు బహుమతులు అందజేశారు. ప్రియా బలుసు గారు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ గారు కోలాటం కర్రలు స్పాన్సర్ చేశారు.

అన్ని శాఖలలో అత్యంత మక్కువతో పనిచేసిన కార్యకర్తలు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి,  మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ మూట తదితరులను అందరూ అభినందించారు.


తామా దసరా బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసినఅట్లాంటా ప్రజానీకం, స్పాన్సర్స్,  ఆడియో లైటింగ్ అందించిన శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సురేష్ ఓలం, స్టేజీ  మరియు ఫోటోబూత్ లను చక్కగా అలంకరించిన ఉదయ ఈటూరు, మీడియా సహకారం అందించిన టీవీ9 శివకుమార్ రామడుగు, టీవీ5 మరియు మనటీవీ ప్రవీణ్ పురం, టీవీ ఆసియా అంజలి చాబ్రియా తదితరులకు తామా అధ్యక్షులు వెంకీ గద్దె గారు ధన్యవాదాలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected