Connect with us

Associations

40 వసంతాల వేడుకల హేళీ: తామా సహపంక్తి భోజనాలు, సంగీత విభావరి

Published

on

అట్లాంటా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’, 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 20 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ సెలబ్రేషన్స్ కి ఆల్ఫారెటా లోని విశాలమైన ఫేజ్ ఈవెంట్స్ హాల్ వేదిక కానున్నది.

ఈ వేడుకలలో భాగంగా దివ్య దీపావళి, పసందైన తామా ట్రేడ్మార్క్ సహపంక్తి భోజనాలు, కళ్ళు మిరుమిట్లుగొలిపే సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, పిల్లలకు మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్ పోటీలు, లీగల్/హెల్త్ సదస్సులు, షాపింగ్ స్టాల్స్, గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులు ఇలా మరెన్నో హంగులు ఆర్భాటాలతో ధూమ్ ధామ్ చేయనున్నారు.

అలాగే టాలీవుడ్ నాయకి లయ, యాంకర్ మధు, ప్రతిభావంతులైన గాయనీ గాయకులు అంజనా సౌమ్య, సాగర్, శృతి, సందీప్ లచే టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆధ్వర్యంలో సంగీత కచేరి, మిసెస్ భారత్ న్యూయార్క్ చైతన్య మరియు అట్లాంటా కాన్సులేట్ జనరల్, స్థానిక సెనేటర్స్, హౌస్ రిప్రజెంటేటివ్స్ స్పెషల్ ఎట్రాక్షన్.

మరెందుకు ఆలస్యం త్వరగా WWW.TAMA.ORG/DEEPAVALI లో టిక్కెట్స్ కొన్నుక్కోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected