Connect with us

Social Service

తానా కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలకు సైతం చేర్చిన ఠాగూర్ మల్లినేని

Published

on

తానా సభ్యుల్లో ఒకనిగా, తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రతినిధిగా, తానా ఫౌండేషన్‌ సేవకునిగా, మీడియా కో ఆర్డినేటర్‌గా నేను చేసిన సేవలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయంటే అందుకు తానా సభ్యులుఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటున్నారు ఠాగూర్‌ మల్లినేని.

తానా సేవల్లో పాల్గొంటూనే మరోవైపు తానా పేరును, కార్యక్రమాలను అన్ని పత్రికల్లోనూ, సోషల్‌ మీడియాల్లోనూ వచ్చేలా ఠాగూర్‌ చేసిన కృషి కందరికీ తెలిసిందే. లక్షలాదిమంది పాఠకులను కలిగి ఉన్న అన్ని ప్రముఖ పత్రికల్లోనూ తానా కార్యక్రమాలు వచ్చేలా చేయగలిగారు.

తానా పేరును తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో కూడా పత్రికల ద్వారా ఎంతోమంది నేడు చూస్తున్నారు. అలాగే సోషల్‌ మీడియా మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌ వాట్సప్‌ ఇతర మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా తానా కార్యక్రమాలు తెలుసుకునేలా చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి గాను తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా పోటీ చేస్తున్నారు. తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా గెలిపిస్తే మరోమారు తానా పేరు ప్రతిష్టలను ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలిసేలా చేయడంతోపాటు కమ్యూనిటీకీ మరింతగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు ఠాగూర్‌ మల్లినేని.

ఠాగూర్‌ నిర్వహించిన పదవులు

  • తానా మీడియా కో ఆర్డినేటర్‌ (2021-23)
  • తానా క్యూరీ నేషన్‌ చైర్‌ (2021-23)
  • తానా రైతుకోసం పబ్లిసిటీ చైర్‌ (2019-21)
  • తానా క్యూరీ నేషన్‌ చైర్‌ (2019-21)
  • తానా క్యూరీ రీజినల్‌ చైర్‌ (2017-19)

ఠాగూర్‌ సేవా కార్యక్రమాలు

  • అక్టోబర్ 1, 2023న పెనమలూరు విద్యార్థులకు తానా స్కాలర్‌ షిప్‌ లు పంపిణీ
  • డిసెంబర్‌ 24, 2022న పెనమలూరులో తానా చైతన్య స్రవంతిలో భాగంగా క్యాన్సర్‌ క్యాంప్‌, ఇఎన్‌టి క్యాంపు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, రైతుకోసం పవర్‌ స్ప్రే కిట్లు, సేఫ్టీ కిట్లు, కుట్టు మిషన్లు ట్రై సైకిళ్ల పంపిణీ
  • 2021 నుండి తానా మీడియా కోఆర్డినేటర్‌గా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, జూమ్‌ మొదలైన వాటిలో అన్ని తానా ఈవెంట్‌ల పోస్టింగ్‌ అండ్‌ ప్రమోషన్స్‌ డిజిటల్‌ మీడియా, ప్రింట్‌ మీడియాలలో తానా వార్తల ప్రచురణకు కృషి
  • 2017-2021 వరకు క్యూరీ-తానా నేషనల్‌/రీజినల్‌ చైర్‌గా క్యూరీ పోటీల నిర్వహణ
  • షార్లెట్‌లో తానా టీమ్‌ స్క్వేర్‌ కార్యకలాపాల నిర్వహణ, బాధితులకు సహాయ సహకారాలు
  • తానా-కేర్స్‌ లో భాగంగా షార్లెట్‌ మరియు అప్పలాచియన్‌ ప్రాంతంలో సిపిఆర్‌ వర్క్‌షాప్‌ల నిర్వహణ
  • షార్లెట్‌లో కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో ఆహార పంపిణీ.
  • పెనమలూరులో తానా బ్యాక్‌-ప్యాక్‌ ప్రోగ్రామ్‌ ద్వారా స్కూల్‌ బ్యాగ్‌లు, ఇతర పరికరాల పంపిణీ
  • బోన్‌ మ్యారో డ్రైవ్‌ల అవశ్యకతపై ప్రచారం, సమన్వయం
  • తానా 5కె: షార్లెట్‌ ప్రాంతంలో ‘‘మన ఊరి కోసం’’ కార్యక్రమం
  • డిసెంబర్‌ 2021లో తానా ఫౌండేషన్‌ ద్వారా పెనమలూరులో కంటి వైద్య శిబిరం ఏర్పాటు
  • కోవిడ్‌-19 సమయంలో పెనమలూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు మరియు కోవిడ్‌-19 రోగులకు మెడికల్‌ కిట్‌లు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్ల పంపిణీ

పెనమలూరు ఎన్నారై అసోసియేషన్‌ సేవా కార్యక్రమాలు

  • పెనమలూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్స్‌, పుస్తకాల పంపిణీ
  • ఎపి జన్మభూమి ద్వారా డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ ఏర్పాటు
  • పేద విద్యార్థినికి 3వేల డాలర్ల సహాయం
  • పశువుల ఆస్పత్రికి 3లక్షల రూపాయల సహాయం
  • పెనమలూరు పాఠశాల అభివృద్ధికి లక్షరూపాయల సహాయం
  • కోవిడ్‌ సమయంలో ఆసుపత్రి సిబ్బందికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల పంపిణీ
  • ప్రభుత్వ ఆసుపత్రికి లక్షరూపాయల విలువైన మెడికల్‌ కిట్ల పంపిణీ
  • ఉచిత కంటి వైద్యశిబిరం
  • పెనమలూరు ఆలయ కార్యక్రమాలకు 50వేల విరాళం
  • సౌరవిద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు జడ్‌పి ఉన్నత పాఠశాలకు 6లక్షల రూపాయల విరాళం

తను చేసిన సేవలు, కార్యక్రమాల పరిధిని చూసి ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా తనకు, అలాగే టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికి ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected