Connect with us

Concert

స్వర సంగమం @ New York; TLCA ఆధ్వర్యంలో SP Charan & Sunitha ఘన నివాళి

Published

on

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary and Cultural Association – TLCA) మరియు కళావేదిక సంయుక్తంగా మే 11 శనివారం రోజున పద్మ విభూషణ్ SP బాలసుబ్రమణ్యం (Sripathi Panditaradhyula Balasubrahmanyam) పాటలతో న్యూయార్క్‌ (New York) లో ఘన నివాళులు అర్పించారు.

డా. సుభద్ర నోరి, డా. దత్తాత్రేయుడు నోరి, శ్రీమతి రాజి కుంచం మరియు డా. కిషోర్ కుంచం ఈ కార్యక్రమానికి సమర్పకులుగా వ్యవహరించారు. స్వర సంగమం అంటూ తమ పాటలతో SP చరణ్ మరియు టాలీవుడ్ (Tollywood) గానకోకిల సునీత ఉపద్రష్ట (Sunitha Upadrashta) న్యూయార్క్‌ (New York) లోని తెలుగువారిని ఉర్రూతలూగించారు.

క్వీన్స్, న్యూయార్క్‌ (Queens, New York) లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (The Hindu Temple Society of North America) ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి, TLCA కార్యవర్గ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ (Board of Trustees) ట్రస్టీస్ జ్యోతి ప్రజ్వలనతో ఈ స్వర సంగమం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

టిఎల్‌సిఎ (TLCA) అధ్యక్షులు కిరణ్‌ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) నాయకత్వంలో తక్కువ సమయంలో ఈ లైవ్ మ్యూజికల్ నైట్ (Live Musical Night) కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ, ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ ని మరియు అతిథులను ఘనంగా సత్కరించారు.

ఇక ఈ కాన్సర్ట్ (Concert) లో పాత, కొత్త, డ్యూయెట్స్, మెలోడీ వంటి SP బాలసుబ్రమణ్యం పాడిన పాటలను మళ్ళీ పాడి SP చరణ్ (Sripathi Panditaradhyula Charan) మరియు సునీత (Sunitha Upadrashta) ప్రేక్షకులను అలరించారు. మధ్య మధ్యలో SP చరణ్ తన జోక్స్ తో అందరినీ నవ్వించడం విశేషం. వీరిద్దరి కాంబోలో సంగీత విభావరి కి తిరుగులేదనిపించింది.

సింగర్ సునీత పుట్టినరోజు (Birthday) ని పురస్కరించుకొని వేదికపైనే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా TLCA వారు ప్రదర్శించిన సునీత AV బైట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించారు. సునీత కె సొంతమైన అసలేం బాలేనా, చిన్ని చిన్ని ఆశ వంటి సోలో పాటలకి ఆహ్వానితులు చప్పట్లు కొట్టినోళ్లు కొట్టినట్టే ఉన్నారు.

యాంకర్ శ్రీలక్ష్మి కుల్కర్ణి (Srilakshmi Kulkarni) చక్కని వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. చివరిగా స్పాన్సర్స్ కి, ఆహ్వానితులకు, వేదిక నిర్వాహకులకు, అతిథులకు, ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ కు ఇలా అందరికీ TLCA (Telugu Literary and Cultural Association) వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చక్కని విందుతో స్వర సంగమం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected