Connect with us

Events

పోటెత్తిన బోస్టన్ మహానాడు, జబ్బ చరిచి కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ బలం చాటిన ఎన్నారైలు

Published

on

. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్
. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి
. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్
. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం
. అంచనాలన్నీ పటాపంచలు
. పసుపు సోదరుల్లో నూతన ఉత్తేజం
. హెలికాఫ్టర్లో పూల వర్షం
. తరలి వచ్చిన మహిళా లోకం సైతం

తెలుగుదేశం పార్టీ అభిమానులతో బోస్టన్ నగరం పోటెత్తింది. మే 20, 21 లలో నిర్వహించిన ఎన్నారై టీడీపీ యూఎస్ఏ మహానాడు నేపధ్యంలో ఆల్ రోడ్స్ లీడ్ టు బోస్టన్ అనే రీతిలో బోస్టన్ నగరం పసుపు మయం అయింది. దీంతో బోస్టన్ మహానాడు మహా విజయవంతం అయింది.

అంతే కాకుండా జబ్బ చరిచి కనీ వినీ ఎరుగని రీతిలో అమెరికా నలుమూలల్లో ఎన్నారైలు తెలుగుదేశం పార్టీ బలం చాటినట్లయింది. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్ అవడంతో ఖాళీ లేక ఎంతోమంతి క్రింద కూర్చొని సైతం కార్యక్రమాలను ఆస్వాదించారంటే మహానాడు బ్లాక్ బస్టర్ సక్సెస్ అనడంలో అతిశయోక్తి లేదు.

ముందుగా న్యూ ఇంగ్లండ్ నుంచి బోస్టన్ మరియు కనెక్ట్కికట్ ఎన్నారై టీడీపీ నాయకులను, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించాలి. సుమారు 5 వారాల క్రితం మహానాడుకు బోస్టన్ నగరం వేదిక అని నిర్ణయించినప్పటి నుండి మహానాడు ముగిసే వరకు బోస్టన్ మరియు కనెక్ట్కికట్ టీమ్స్ కృషి వర్ణనాతీతం.

40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఒక పక్క, ఇటు అమెరికా అటు రెండు తెలుగు రాష్ట్రాల కళ్ళు ఇంకో పక్క, ఇండియా నుంచి సీనియర్ నాయకులూ వస్తున్నారు, అసలే పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మంచి ఊపు తెచ్చేలా ఉండాలి మహానాడు అంటే.. ఇలా భారీ అంచనాలతో కూడిన మహానాడు నిర్వహణ కత్తిమీద సాము వంటిదే.

అయినప్పటికీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ నూతన ఒరవడి సృష్టించేలా ఈ బోస్టన్ మహానాడు నిర్వహించి అందరి మన్ననలు పొందారు స్థానిక నేతలు. ఉక్కు సంకల్పాన్ని చేతబట్టి చిన్న విషయం పెద్ద విషయం అంటూ తేడా లేకుండా ఆహ్వానాలు, హోటల్ రిజర్వేషన్స్, భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక ప్రాంగణం అలంకరణ ఇలా అన్నీ పకడ్బందీ ప్రణాళికతో చిన్న లోటుపాటు కూడా లేకుండా నిర్వహించారు.

కొతమంది పసుపు సోదరులు గురువారం రాత్రికే బోస్టన్ చేరుకున్నారు. ఇంకొంతమంది శుక్రవారం, చివరిగా అందరూ శనివారం మహానాడు మెయిన్ ఈవెంట్ కి అందేలా పాల్గొన్నారు. శుక్రవారం బాంక్వెట్ డిన్నర్ నిర్వహించారు. ఇక అసలైన మహానాడు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా ప్రోగ్రాం లైనప్ ఉంది.

జ్యోతి ప్రజ్వలన, గణేషుని ప్రార్ధనా గీతంతో మొదలుపెట్టి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు చిత్ర పటాల ఎక్హిబిషన్ కి రిబ్బన్ కటింగ్ చేసారు. తర్వాత నిర్వాహకులు అందరూ వేదికపైకి వచ్చి మా తెలుగు తల్లి పాటతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే ఈ మధ్య కాలంలో అమెరికాలో చనిపోయిన టీడీపీ అభిమానుల కొరకు రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఓపెనింగ్ ప్రసంగం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్ ద్వారా ప్రసంగించారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా జై బాబు, జై జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ నినాదాలు మార్మోగాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంవిఎస్ఎన్ రాజు, గౌతు శిరీష, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మన్నవ సుబ్బారావు, నన్నూరి నర్సిరెడ్డి, కందుల నారాయణ రెడ్డి వంటి హేమాహేమీల ప్రసంగాలతోపాటు ఆన్లైన్లో జూమ్ ద్వారా చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఏపీ అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. అలాగే అమెరికాలోని వివిధ నగరాల రిప్రజంటేటివ్స్ కూడా తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వంటి కొన్ని తీర్మానాలు చేసారు. లైవ్ డిబేట్లు, వర్క్ షాపులు, మహిళా విభాగం చర్చలు, తెలుగు మహిళ ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, మహానాడు కమిటీల అభినందన, పంచ్ జుగల్బందీ, తెలుగు కళా వైభవం ఇలా ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ తో రోజంతా మహానాడుకి కళ తెచ్చారు.

ఒక పక్క కార్యక్రమాలు నడుస్తుండగానే ఎక్కడా ఇబ్బంది లేకుండా టిఫిన్, మధ్యాహ్న భోజనం, టీ కాఫీలు, రాత్రి భోజనం ఇలా అన్నీ అనుకున్నట్టుగా నడిపించారు. ఎన్టీఆర్ వేషధారణతో చేసిన ఒక కార్యక్రమానికి అయితే అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు కోటి & ట్రూప్ తో మ్యూజికల్ నైట్ ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి ప్రోగ్రాం హైలైటే.

అమెరికా రేంజ్ లో ఈ బోస్టన్ మహానాడుని 1987 లో విజయవంతమైన ఆంధ్రప్రదేశ్ మహానాడుతో పోలుస్తుండడం చూస్తుంటే బోస్టన్ మహానాడు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో చూడండి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే ఊపు 2024 వరకు కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు ని మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి పంపిస్తాం అని ప్రతిజ్ఞలు చేస్తున్నారు పసుపు సోదరులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected