Connect with us

Donation

అమరావతి మహా పాదయాత్రలో గళం కలిపిన సునీల్ పంత్రా

Published

on

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ మహా పాదయాత్ర తిరుపతి నగరంలోకి ప్రవేశించిన సందర్భంగా చిత్తూర్ ఎన్నారై, డెట్రాయిట్ వాసి సునీల్ పంత్రా రైతులకి సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ పాదయాత్రలో గళం కలిపారు.

అలాగే పాదయాత్ర రైతులకు ఒకరోజు భోజన ఖర్చులకు సరిపోను సుమారు లక్షా యాభైవేల రూపాయల సహాయం చేసారు. సునీల్ అమెరికాలో కూడా అమరావతికి మద్దతుగా ఇంతకు ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected