సుమారు 20 సంవత్సరాల నుంచి వైద్య విద్యలో రాణిస్తున్న సెయింట్ మార్టీనస్ యూనివర్సిటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అమెరికాకి కూతవేటు దూరంలో అందమైన క్యూరసా ద్వీపంలో నెలకొన్న ఈ వైద్య కళాశాల వైద్య విద్యపై మక్కువ ఉన్నవారికి బాగా సుపరిచితం.
ఇండియా, అమెరికా, కెనడా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల నుంచి వందల్లో వైద్య విద్యార్థులు సెయింట్ మార్టీనస్ యూనివర్సిటీకి వెళ్లడం పరిపాటి. వైద్య విద్యకి అంత మంచి పేరున్న సెయింట్ మార్టీనస్ యూనివర్సిటి ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా స్నాతకోత్సవ సభ వైభవంగా నిర్వహించింది.
జులై 23, 2022 న కాబోయే డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్లు మరియు యూనివర్సిటి యాజమాన్యంతో ఈ గ్రాడ్యుయేషన్ సెరిమొని కళకళలాడింది. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు సాగిన ఈ స్నాతకోత్సవ సభకి వేదికగా మిచిగన్ రాష్ట్రం, ట్రాయ్ నగరంలోని సోమర్సెట్ ఇన్ నిలిచింది.
ముందుగా సెయింట్ మార్టీనస్ యూనివర్సిటి అసోసియేట్ డీన్ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ బ్రాండన్ క్రౌట్ స్వాగతోపన్యాసంతో ఘనంగా సభని ప్రారంభించి, ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి వైద్య పట్టా అందుకోబోతున్న గ్రాడ్యుయేట్స్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం యూనివర్సిటి ఫ్యాకల్టీ డాక్టర్ శాలీ మరియు డాక్టర్ వేములపల్లి గ్రాడ్యుయేట్స్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు వైద్య విద్యార్థులు పడిన కష్టాన్ని మరియు అత్యంత నూతన ప్రమాణాలతో సెయింట్ మార్టీనస్ యూనివర్సిటి బోధించిన తరగతులను గుర్తు చేశారు.
గ్రాడ్యుయేట్స్ అందరికీ వరుసగా డిగ్రీ పట్టా ప్రదానం చేశారు. అలాగే డాక్టర్ కిలారు గ్రాడ్యుయేట్స్ తో పట్టభద్రుల ప్రమాణం చేయించారు. చివరిగా డాక్టర్ శ్రీధర్ గింజుపల్లి చ్లొసింగ్ రిమార్క్స్ లో భాగంగా ఆహ్వానితులందరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు. తదనంతరం లంచ్ తో సెయింట్ మార్టీనస్ వైద్య కళాశాల స్నాతకోత్సవం ఘనంగా ముగిసింది.
ఈ గ్రాడ్యుయేషన్ సెరిమొనీని కొంతమంది విద్యార్థులు వర్చ్యువల్ గా ఆన్లైన్లో హాజరవడం విశేషం. గ్రాడ్యుయేట్స్ మరియు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు దిగుతూ ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరిన్ని గ్రాడ్యుయేషన్ ఫోటోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే యూనివర్సిటి మరియు కోర్సుల సమాచారం కొరకు https://www.martinus.edu/ ని సందర్శించండి.