Published
2 years agoon
By
NRI2NRI.COMపశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ (SRKR Engineering College) లో చదువుకొని ప్రస్తుతం ఉత్తర అమెరికాలో (North America – USA, Canada, Mexico) ఉన్న పూర్వ విద్యార్థులు ఎస్ఆర్కేఆర్ఈసీ ఆలంనై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (SRKREC Alumni Association of North America – SAANA) పేరుతో ఒక నాన్ ప్రాఫిట్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా నగరంలోని చిరునామాతో 501(c)(3) లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఈ ఎస్ఆర్కేఆర్ఈసీ ఆలంనై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (SAANA) అధికారికంగా ఉత్తర అమెరికా (North America) లో మొట్టమొదటిది కావడం విశేషం.
SAANA ఏర్పాటు చేసిన వెంటనే మొట్టమొదటి పూర్వ విద్యార్థుల సమావేశం (Alumni Meet) గత మే 27న న్యూ జెర్సీ నగరంలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఘనంగా నిర్వహించిన కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో SRKR ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, మానేజ్మెంట్ కూడా పాల్గొన్నారు.
మే 27, శనివారం ఉదయం 9 గంటలకు న్యూ జెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పొజిషన్ సెంటర్ లోని బాల్ రూమ్ లో రెజిస్ట్రేషన్స్ తో SAANA సమావేశం ప్రారంభమయ్యింది. వచ్చినవారు వచ్చినట్టు రెజిస్ట్రేషన్ డెస్క్ వద్ద తమ పేరు నమోదు అనంతరం బ్యాడ్జ్ తీసుకొని తోటి పూర్వ విద్యార్థులతో మాటా మాట కలుపుతూ కనిపించారు.
SAANA ఏర్పాటుచేసిన తేనీటి విందు అనంతరం అందరూ వేదిక ముందు ఆసీనులయ్యారు. వ్యాఖ్యాతలు సృజన కొరిపల్లి, వెంకీ గద్దె అందరికీ స్వాగతం పలికి SAANA కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు మరియు ఇండియా నుంచి విచ్చేసిన ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, మానేజ్మెంట్ అందరినీ వేదిక మీదకు ఆహ్వానించగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అందరి ముందు ఆఫీషియల్ గా SAANA ని లాంచ్ చేసి అధ్యక్షులు రవి శంకర్ వీరమాచనేని సంస్థ పుట్టుపూర్వోత్తరాలను వివరించారు. కాలేజ్ మానేజ్మెంట్ చేతులమీదుగా WWW.TheSAANA.ORG వెబ్సైటుని ప్రారంభించారు. ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, మానేజ్మెంట్ ఒక్కక్కరూ క్లుప్తంగా ప్రసంగించారు.
అనంతరం NATS వారి మెయిన్ స్టేజ్ పై SRKR ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, మానేజ్మెంట్ సభ్యులందరినీ SAANA కార్యవర్గ సభ్యులు మరియు బోర్డు సభ్యులు కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అలాగే పలు సంవత్సరాల బ్యాచ్ ఫొటోస్, కాలేజ్ విషయాలను మిళితం చేసి తయారుచేసిన వీడియోని ప్రదర్శించారు. ఈ సందర్భంగా బోర్డు ఛైర్మన్ రాజు పెనుమత్స, బోర్డు వైస్ ఛైర్మన్ భానుప్రకాష్ ధూళిపాళ్ల ప్రసంగించారు.
తదనంతరం అందరూ సమీపంలోని హోటల్ షెరటాన్ లో సమావేశమయ్యారు. SRKR Engineering College గోల్డెన్ జూబ్లీ సంవత్సరానికి కాలేజీలో ఒక ఆడిటోరియం కట్టేలా అందరూ సహకరించాలని పద్మరాజు గారు కోరారు. వెంటనే కొందరు స్పందించి SAANA ద్వారా విరాళాలు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు ముందు ముందు తెలుస్తాయి.
ప్రస్తుత ప్రిన్సిపల్ జగపతి రాజు గారు కాలేజీ విషయాల గురించి ప్రస్తావించారు. అలాగే కాలేజీ సెక్రటరి & కరెస్పాండెంట్ నిశాంత్ వర్మ గారు, గవర్నింగ్ బాడీ మెంబర్ ప్రతీక్ వర్మ గారు కాలేజీ తరపున సహకారం అందించే విషయాలను గూర్చి మాట్లాడారు. మధ్య మధ్యలో సరదా ప్రశ్నలు అడిగి కరెక్ట్ సమాధానాలు చెప్పినవారికి గిఫ్ట్ కార్డ్స్ బహుమతిగా అందించారు.
పసందైన విందు భోజనం చేస్తున్నంతసేపు కూడా అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ పూర్వ విద్యార్థుల మొట్టమొదటి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ 1980 లోనే స్థాపించి స్వయంప్రతిపత్తి (Autonomous) కళాశాల స్థాయికి ఎదిగిన SRKR గుర్తుండేలా రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు.
మొత్తంగా సుమారు 160 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్టర్స్ చేస్తున్న విద్యార్థుల నుంచి కాలేజీ కెళ్లే పిల్లలున్న పెద్దలతోపాటు మనవళ్ళు, మనవరాళ్లు ఉన్న వారు వివిధ బ్రాంచెస్ లో వివిధ సంవత్సరాలలో SRKR కాలేజీలో చదువుకున్న వారు అవడం భిన్నత్వంలో ఏకత్వానికి అద్దం పట్టింది.
మధ్యలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు గోపీచంద్ మలినేని తళుక్కున మెరిశారు. కాసేపు కుశల ప్రశ్నలు వేసుకొని వారితో ఫోటోలు దిగారు. అలాగే అందరూ ప్రొఫెసర్స్ తో, తమ తమ బాచెస్ స్నేహితులతో ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.
భీమవరం అనుభవాలను పంచుకుంటూ, కాలేజీ మధురానుభూతులను నెమరువేసుకుంటూ ఆటోగ్రాఫ్ మెమొరీస్ లా రోజంతా సరదాగా సాగింది. ఒకరు నేను అప్పట్లో ఆ మెస్సులో తినేవాడిని, ఇంకొకరు ఆదర్శనగర్లో పలానా ప్రాంతం ఇప్పుడు ఎలావుందో, మరొకరు భీమవరం పూర్తిగా మారిపోయింది అంటూ ఇలా రకరకాలుగా ఒక్కసారిగా అందరూ కాలేజ్ రోజుల్లో కెళ్లారు.
చివరిగా అందరూ గుర్తుకొస్తున్నాయి అంటూ సాగే పాటను తలపిస్తూ కాలేజ్ ఫేర్వెల్ డేలో లాగా బాయ్ బాయ్ చెప్పుకుంటూ సంతోషంగా తిరిగి వెళ్ళారు. దీంతో SRKR ఇంజినీరింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థుల SAANA (SRKREC Alumni Association of North America) మొట్టమొదటి సమావేశం విజయవంతంగా ముగిసింది.
సానా (SAANA) లో సభ్యత్వం కొరకు www.TheSAANA.org/SANAMembership ని సందర్శించండి. అందరూ ఉత్తర అమెరికాలో ఉన్న మీ SRKR స్నేహితులందరినీ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించవలసిందిగా SAANA కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు కోరారు.
Guest of Honors from India
SAANA Board of Directors
SAANA Executive Committee
SAANA Advisory Committee (more to add)
చాలా కాలం తర్వాత ఇంత చక్కని సమావేశాన్ని కొన్ని నెలలపాటు కష్టపడి ప్రణాళికాబద్ధంగా మరియు ఆహ్లాదకరంగా ఏర్పాటుచేసిన SAANA కార్యవర్గ సభ్యులను మరియు బోర్డు సభ్యులను అందరూ అభినంచారు. మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/SAANA-Meet ని సందర్శించండి.