Frankfurt, Germany: ఫ్రాంక్ఫర్ట్ లో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం (Sri Venkateswara Swamy Kalyana Mahotsavam) అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని ఇ.వి (SBVC) ఆధ్వర్యంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది. 
టిటిడి (Tirumala Tirupathi Devasthanams – TTD) డెప్యుటి.ఇ.ఇ. శ్రీ మల్లయ్య గారి పర్యవేక్షణలో టిటిడి వేధ పండితుల బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ కృతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఈ కార్యక్రమానికి కన్సులెట్ జెనరల్ ఒఫ్ ఇండియా, కన్సులెట్ జెనెరల్ శ్రీమతి శుచితా కిషొర్ (CGI Frankfurt), Königstein im Taunus  మేయర్ శ్రీ హెల్మ్  మరియు ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, శ్రీవారి దివ్య ఆశీస్సులను పొందారు. విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. 
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. అర్చకులు తిరుమల (Tirumala) లో జరిగే విధంగా కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. వేదిక మొత్తం “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగింది. 
కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఒక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ మరియు ఇతర భారతీయ రాష్ట్రాల భక్తులతో పాటు అనేక విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. 
అనంతరం భక్తులకు టిటిడి (Tirumala Tirupathi Devasthanams – TTD) లడ్డు ప్రసాదం మరియు కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ క్రిష్ణ జవ్వాజి గారు మరియు సూర్య ప్రకాష్ వెలగా గారు మాట్లాడుతూ, ఫ్రాంక్ఫార్ట్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కల్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం మా భాగ్యం. 
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు. SBVC అధ్యక్షులు శ్రీ క్రిష్ణ జవ్వాజి గారు మాట్లాడుతూ, “ఫ్రాంక్ఫార్ట్ లో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం మా అసోసియేషన్ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. 
ఈ విజయవంతమైన కార్యక్రమం శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని  (SBVC) బృందం యొక్క అంకితభావం, సమిష్టి కృషి ఫలితం. SBVC అధ్యక్షులు శ్రీ క్రిష్ణ జవ్వాజి మరియు నిర్వాహకులు శ్రీ సూర్య ప్రకాష్ వెలగా గారి నాయకత్వంలో, సభ్యులు సుబ్బారావు కొర్లెపర, పూర్ణ కొర్లెపర, దిలిప్ కుమార్, ప్రసాద్ నందమూరి మరియు భారతి సమన్వయంతో ఈ మహోత్సవం ఘనవిజయాన్ని సాధించింది. 
వారి సమిష్టి కృషితో ఫ్రాంక్ఫార్ట్ లో తిరుమల వైభవం సజీవమైంది. ఈ కల్యాణోత్సవం లో జర్మనీ (Germany) దేశం లో మ్యూనిచ్, హాంబర్గ్ నగరాల ప్రతినిధులు టిట్టు మద్దిపట్ల, డా. శివ శంకర్ లింగం పాల్గొన్నారు. యూరప్ & యు.కె కళ్యాణం ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని (Dr. Kishore Babu Chalasani) సారధ్యంలో డాక్టర్ శ్రీకాంత్,  సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
“గోవిందా… గోవిందా!” నినాదాలతో Germany లోని Frankfurt లో వైభవంగా ముగిసిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ దివ్య వేడుక భక్తుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అని చెప్పటంలో అతిశయోక్తి కాదు.