Connect with us

Devotional

Cumming, GA: సత్యనారాయణ స్వామి గుడిలో ‘శ్రీ మహాలక్ష్మి వైభవం’ ప్రవచనాలు

Published

on

త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు “శ్రీ మహాలక్ష్మి వైభవం” గురించి మూడు రోజుల ప్రవచనాలు కమ్మింగ్, అట్లాంటా లోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడిలో నిర్వహించారు. వందలాది భక్తులు ఈ మూడు రోజులు ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో క్రమం తప్పకుండా విచ్చేసి శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనాలు ఎంతో భక్తి శ్రద్దలతో విని తరించారు.

శ్రీ మహాలక్ష్మి వైభవం గురించి, లక్ష్మి కటాక్షం గురించి వివిధ వివరణలు ఇవ్వడమే కాకుండా, ఎంతో మందికి మంత్రోపదేశం చేశారు. చక్కటి వర్చస్సు, మధురమైన కంఠంతో, సమయానుకూల చలోక్తులతో మూడు రోజుల ప్రవచానలతో అందరిని భక్తిమార్గం వైపు మరలించడంలో చరితార్ధులైనారు.

చివరి రోజు ఏప్రిల్ 18 వ తేదీన శ్రీ సత్యనారాయణ స్వామి గుడి (Sri Satyanarayana Swamy Temple, Atlanta) ప్రధాన అర్చకులు, గురువుగారు శ్రీ రవి మేడిచెర్ల గారు మరియు వేద పండితుల సమక్షంలో సన్మానించడమే కాకుండా, సభాపూర్వకంగా “శబ్ద బ్రహ్మ” అనే బిరుదుతో సత్కరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected