తెలంగాణ లోని అంబర్‌పేట లో మొదలుపెట్టి, అమెరికా వచ్చి జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెడుతున్న చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి (Chandrasekhar Reddy Subbagari ) తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందామా?
NRI2NRI.COM సరికొత్తగా ప్రారంభించిన స్పాట్ లైట్ విత్ ఎన్నారై2ఎన్నారై (Spotlight with NRI2NRI) కార్యక్రమంలో భాగంగా రెండవ ఎపిసోడ్ కి చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి అతిథిగా విచ్చేశారు. అట్లాంటా (Atlanta) లో హీరో లెక్కన ఉన్న చంద్ర సడన్ గా క్రూరుడుగా ఎలా నటించారో తెలుసుకుందాం.
ఒకప్పుడు సీరియల్స్ లో నటించే బంగారం లాంటి అవకాశం మిస్ చేసుకొని, ఇప్పుడేమో జీవిస్తూ నటించాలన్న తపనతో టాలీవుడ్ (Tollywood) లోకి డెబ్యూ మూవీతో అందునా విలన్ పాత్రలో నటించిన అనుభూతులు స్పాట్ లైట్ విత్ ఎన్నారై2ఎన్నారై (Spotlight with NRI2NRI) ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.
ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమా ఈ నెల ఫిబ్రవరి 22న రాస్వెల్ (Roswell, Georgia) లోని అరోరా సినీ ప్లెక్స్ (Aurora Cineplex) లో విడుదల అవుతున్న సందర్భంగా మరిన్ని విషయాలు ఈ ముఖా ముఖి సమావేశం ద్వారా చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి (Chandrasekhar Reddy Subbagari) మాటల్లోనే వీక్షిద్దాం.