Connect with us

Interviews

Spotlight with NRI2NRI: నెల్లూరు టు టాలీవుడ్ వయా అట్లాంటా – వెంకట్ దుగ్గిరెడ్డి

Published

on

2023 లో విడుదలైన గాలోడు సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన అప్2డేట్ టెక్నాలజీస్ (Up2Date Technologies) అధినేత, మంచి పరోపకారి (Philanthropist), సాయిబాబా వీర భక్తుడు, అట్లాంటా (Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి ఇప్పటి వరకు దాదాపు 10కి పైగా సినిమాలలో నటించి అందరినీ మెప్పిస్తున్నారు.

NRI2NRI.COM సరికొత్తగా ప్రారంభించిన స్పాట్ లైట్ విత్ ఎన్నారై2ఎన్నారై (Spotlight with NRI2NRI) కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి ఎపిసోడ్ కి వెంకట్ దుగ్గిరెడ్డి అతిథిగా విచ్చేశారు. బాబా దగ్గిర చీటీ వేసి ఎస్ అంటే ఎస్.. నో అంటే నో అంటున్న వెంకట్ మనసువిప్పి మాట్లాడారు.

తను పుట్టిన ప్రాంతం, కుటుంబం, వ్యాపారం, సినిమాలలోకి ఎంట్రీ, తనికెళ్ల భరణి (Tanikella Bharani), అలీ, సుమన్ (Suman), అదిరే అభి, జబర్దస్త్ సుధీర్, సత్య శ్రీ, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ నవీన్ తదితరులతో కలిసి నటించిన అనుభవాలు, మూవీ షూటింగ్ అనుభూతులు వంటి విషయాలను పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు టు టాలీవుడ్ వయా అమెరికా లోని అట్లాంటా అంటూ లేటెస్ట్ గా నటించిన ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమా ఈ నెల ఫిబ్రవరి 22న రాస్వెల్ (Roswell, Georgia) లోని అరోరా సినీ ప్లెక్స్ (Aurora Cineplex) లో విడుదల అవుతున్న సందర్భంగా మరిన్ని విషయాలు వెంకట్ దుగ్గిరెడ్డి మాటల్లోనే పై వీడియోలో చూడొచ్చు.

error: NRI2NRI.COM copyright content is protected