గిడుగు వెంకట రాంమూర్తి 158 వ జయంతి సందర్భంగా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు – నార్వే, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖలు వారు సంయుక్తంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని సుమారు 60 కి పైగా తెలుగు సమాఖ్యల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే ఆగష్టు 28, 29 తేదీలలో జరిగే ఈ తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం కోవిడ్ కారణంగా అంతర్జాలంలో వర్చువల్ గా నిర్వహింపబడును .
ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ మధ్యనే అందరి సమక్షంలో మొదటి కార్యక్రమ సమాచార పత్రాన్ని ఆవిష్కరించారు. ప్రపంచం నలుమూలల నుండి వక్తలు ప్రసంగించనున్నారు. పాటల పోటీలు, తెలుగు మాట ప్రవాసుల నోట అంటూ ఎన్నారై తెలుగు ఐడల్ తదితర కార్యక్రమాలకు ప్రణాళిక చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందీస్తున్న ప్రప్రంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలవారికి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం సమర్పకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రపంచం నలుమూలల ఉంటూ తెలుగు భాష ఉనికి కోసం పరితపించే మీరందరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు నిర్వాహకులు.