మే నెల 5 వ తేది సికింద్రాబాద్ “ఇన్క్రెడిబుల్ వన్ కన్వేషన్” లో “తార ఆర్ట్స్ అకాడమీ” ఆధ్వర్యంలో తానా సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారిని ఘనంగా సన్మానించి వారు స్వయంగా రచించిన “జరుగుతున్న కథలు” పుస్తక ఆవిష్కరణ వైభవంగా జరిపించి శిరీష గారు చేస్తున్న అనేక సేవల గురించి వివరించారు.
కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర బి. సి. కమిషన్ కమిషనర్ శ్రీ వకుళ భరణం కృష్ణ మోహన్ రావు గారు, విశిష్ట అతిథులు గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పూర్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ భాస్కర్ గారు, మరియు ప్రఖ్యాత సీనియర్ సిని నటి రోజా రమణి గారు, శిరీష గారి ఖ్యాతిని అద్భుతంగా కొనియాడినారు.
శిరీష గారు తెలుగు జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమ గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాలని “తార ఆర్ట్స్ అకాడమీ” అధ్యక్షులు సంకె రాజేష్ పేర్కొన్నారు. శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారిని మా సంస్థ తార ఆర్ట్స్ అకాడమీ ఆత్మీయంగా సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను.
ముఖ్యంగా మాకు, మా సంస్థకు ఈ అవకాశం ఇప్పించిన ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు “శ్రీమతి పక్కి లతా మంజూష” గారికి మా సంస్థ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సంస్థ కు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్న గౌరవ నీయులు శ్రీ విజయ్ భాస్కర్ గారికి మా సంస్థ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ కళాభివందనాలతో సంకె రాజేష్, అధ్యక్షులు, తార ఆర్ట్స్ అకాడమీ.