Connect with us

Patriotism

పహల్గాం బాధితుల గౌరవార్థం మౌన దీపం కార్యక్రమం @ New York Times Square

Published

on

New York: భారతదేశం, పహల్గాం (Pahalgam) లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు కోల్పోయిన ప్రాణాలకు గౌరవం తెలియజేసేందుకు న్యూయార్క్ (New York) నగరంలోని టైమ్స్ స్క్వేర్ (Times Square) లో ఆదివారం ఏప్రిల్ 27 మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మౌన దీపం కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి వచ్చిన అనేక మంది పాల్గొన్నారు. బాధితులకు శ్రద్ధాంజలి (Condolences) అర్పించడమే కాక, మానవత్వం, శాంతి, ఐక్యత వంటి విలువలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ, ప్రతి ప్రాణ నష్టాన్ని న్యాయం కోసం చేసే పిలుపుగా గుర్తించాలనే సందేశం ఇవ్వబడింది.

ఈ మౌన దీపం ద్వారా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, సామూహిక ప్రార్థనలతో బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ప్రతి ప్రాణ నష్టం
న్యాయం కోసం పిలుపు
ఐక్యత కోసం పిలుపు
మరచిపోకూడదన్న పిలుపు

error: NRI2NRI.COM copyright content is protected