Connect with us

Women

TANA Foundation: పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా కుట్టుమిషన్ల వితరణ

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 14, 2024 న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని లింగారావుపాలెం, చిలకలూరిపేట లలో నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం 10 కుట్టుమిషిన్స్ ఉచితంగా అందించారు.

తానా (Telugu Association of North America) ఫౌండేషన్ తరుపున శ్రీరామ్ ఆలోకం, రవి వట్టికూటి దాతలుగా వ్యవహరించారు. అలాగే స్థానిక 44 వ సంక్రాంతి సంబరాల (Pongal Celebrations) సందర్భంగా యువజన క్రీడా కార్యక్రమాల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ (Venkata Ramana Yarlagadda) మాట్లాడుతూ.. యువత సృజనాత్మకంగా పనిచేస్తే క్రియేటర్స్ గా మారతారని సందేశం ఇచ్చారు. ఎన్నారై దాతలు శ్రీరామ్ ఆలోకం గారికి, రవి వట్టికూటి గారికి అభినందనలు తెలియజేశారు.

అలాగే గ్రామ ప్రజలకు, గ్రామ NRI కమిటీని తానా ఫౌండేషన్ తరపున హృదయపూర్వకంగా అబినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ లకు, తానా సభ్యులకు, తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు కు, దాతలకు కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected