Connect with us

Politics

ప్రముఖుల గౌరవార్థం ఏర్పాటు చేసిన Republican Party డిన్నర్ కు సతీష్ వేమన

Published

on

అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) సమీపిస్తున్న వేళ ప్రచార సభలతో ఉభయ పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ (Republican Party) తనదైన శైలిలో దూసుకుపోతుండగా.. తెలుగు వారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్టాల తరపున తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana) మరియు మిత్రులు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ తెలుగు వారి మద్దుతు కూడగట్టి డోనాల్డ్ ట్రంప్ విజయానికి అవిరళ కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా రెండు లక్షల మంది ప్రజలు హాజరైన చారిత్రాత్మకమైన మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ (Madison Square Garden, New York) లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి హాజరవ్వటం, ట్రంప్ (Donald John Trump) గెలుపుకు పిలుపునిస్తూ తెలుగు ప్రముఖులైన పరిచయస్తులందరితోనూ సమావేశవుతూ ముందుకు సాగుతున్నారు.

నిన్నటి మాడిసన్ స్క్వేర్ గార్డెన్ 1800ల నుండి డెమొక్రాటిక్ (Democratic Party) మరియు రిపబ్లికన్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇలాన్ మస్క్ (Elon Musk), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) మరియు తులసీ గబ్బార్డ్‌ (Tulsi Gabbard) లతో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 30 ప్రముఖ వ్యక్తులతోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్‌ (JD Vance) తో కలిసి సతీష్ వేమన మన పరిమిత ప్రముఖుల గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్ కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. కాకతాళీయంగా.. తమ అత్తమామల ద్వారా భారతదేశం (India) లోని కృష్ణా జిల్లా (Krishna District, Andhra Pradesh) తో మా ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని సతీష్ వేమన మరియు ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్‌ (James David Vance) సంభాషించుకోవటం గమనార్హం.

రాబోయే రోజుల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున తెలుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పి మరింతగా మేలు జరిగేలా కృషి చేయాలని జెడి వాన్స్‌ (JD Vance), సతీష్ వేమన (Satish Vemana) ను అభ్యర్దించారు. అదే విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ (US Economy) తిరిగి పుంజుకునే విధమైన విధానాలను రిపబ్లికన్ పార్టీ తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తోంది.

గత కొన్ని రోజులుగా ప్రచారంతోపాటు ట్రంప్ (Donald Trump) మరియి రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. ట్రంప్ మరియు జెడి వాన్స్ తో కలిసి రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతూ రిపబ్లికన్ పార్టీ (Republican Party) విజయానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అమెరికా భారతదేశ సత్సంబంధాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సతీష్ వేమన (Satish Vemana) తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected