అమెరికాలోని చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారి ముగ్గుల వేడుకలు నేపర్విల్ లోని మాల్ ఆఫ్ ఇండియాలో ఎంతో వైభవంగా నిర్వహింపబడ్డాయి. అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి గారి నేతృత్వంలో, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం లో 300 మందికి పైగా పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ నాడే ఈ వేడుకలు జరపడంతో, ఈ వేడుక లో పాల్గొన్న వారందరినీ తమ ఏర్పాట్ల తో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లినంత అనుభూతిని అందించారు. ఈ ముగ్గుల పోటీలను 3 విభాగాలు – పెద్దలు, తల్లి – పిల్లలు, చిన్నారులు గా నిర్వహించారు. పెద్దలు, చిన్నారులు కూడా ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
చిన్నారులకు, మన తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ, ముగ్గుల పోటీలు నిర్వహించటం ప్రశంసనీయం. ఈ పోటీలకు డా. భార్గవి నెట్టం, సౌమ్య బొజ్జ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీలో పాల్గొన్న వారందరూ తమ లోని కళానైపుణ్యాన్ని ఆవిష్కృతం చేసి తమ రంగవల్లులతో మాల్ ఆఫ్ ఇండియాకి కొత్త కళను తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమానికి గోల్డెన్ రూల్ ఫ్యామిలీ ప్రాక్టిస్ సంస్థ డా. జిగర్ ఠక్కర్ గారు విరాళమందించి, ఎంతగానో తోడ్పడ్డారు. స్టెమ్ శాల సంస్థ వారు చిన్నారులను వారి లెగో వర్క్ షాప్ తో ఎంతగానో అలరించి, తమ విరాళంగా, ముగ్గుల పోటీలలో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు అందచేసి ప్రోత్సాహించారు.
భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులందరికీ మాల్ ఆఫ్ ఇండియా లోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణము లో భోగి పళ్ళు పోసారు. ఆడపడుచులు చక్కని మంగళ హారతులు ఆలపించి ఇంటి పండుగ వలే యథావిథిగా జరిపారు. చిన్నా పెద్దా అందరూ కలసి గొబ్బిళ్ళ వద్ద కోలాటం ఆడటంతో ఈ వేడుకలో సంపూర్ణ సంక్రాంతి శోభ నెలకొంది.
నరేష్ చింతమాని ఆధ్వర్యంలో శ్వేత కొత్తపల్లి, సుజాత అప్పలనేని, శ్రీ స్మిత నండూరి, శైలజ సప్ప, సవిత మునగ, మాలతీ దామరాజు, శృతి కూచంపూడి, అన్విత పంచాగ్నుల మున్నగు వారు తయారుచేసిన తెలుగు భోజనం, విచ్చేసిన వారందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు.
సుజాత అప్పలనేని, తమిశ్ర, కొంచాడ, మంజరి మోటమర్రి, శ్వేత కొత్తపల్లి, శృతి వర్మ, ప్రవీణ అంజుర్, బోస్ కొత్తపల్లి మున్నగు వారు తయారు చేసిన కొబ్బరి బూరెలు ప్రత్యేక ఆకర్షణ గా నిలచాయి. స్వదేశ్ మీడియా వారు ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు.
తమిశ్ర కొంచాడ ఆధ్వర్యంలో కృష్ణ డెకార్స్ సహాయముతో సౌమ్య బొజ్జ, గీతిక మండల, శైలజ సప్ప, తదితరులు ఆకర్షణీయంగా అలంకరించి ప్రాంగణానికి సంక్రాంతి వన్నె తెచ్చారు. సంస్థ ధర్మకర్తలు సుజాత అప్పలనేని,డా. భార్గవి నెట్టెం, దినకర్ కరుమూరి, ఉమ కటికి ఈ వేడుకలకు హాజరయ్యారు.
అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మాజీ అధ్యక్షులు గౌరీ శంకర్ అద్దంకి, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ మతుకుమల్లి, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లు సవిత మునగ, గిరి రావు కొత్తమాసు, పద్మా రావు అప్పలనేని, శైలజ సప్ప, నరసింహా రావు వీరపనేని, మురళీ రెడ్డివారి, ప్రభాకర్ మల్లంపల్లి, నరేష్ చింతమాని, హేమంత్ తలపనేని, తమిశ్ర కొంచాడ, అన్విత పంచాగ్నుల, శ్రీ స్మిత నండూరి, గీతిక మండల, కావ్య శ్రీ చల్ల మరియు ఎంతోమంది వాలంటీర్లు సహాయ సహకారాలు అందించి ఈ సంవత్సర మొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.