Connect with us

Music

సక్క సక్కని పూల సుక్క అంటూ మరో పాటతో అలరిస్తున్న జనార్దన్ పన్నెల

Published

on

జార్జియా జానపద జనార్ధన్ గా పేరొందిన జనార్దన్ పన్నెల మరోమారు చక్కని పాటతో మన ముందుకు వచ్చారు. దసరా పండుగ సీజన్లో “సక్క సక్కని పూల సుక్క” అంటూ బతుకమ్మ (Bathukamma) పాటతో ఈ సంవత్సరం మరోసారి అందరిని అలరిస్తున్నారు. ఈ పాట కొంత భాగం అమెరికాలో, మరికొంత భాగం ఇండియాలో షూట్ చేయడం విశేషం.

ఈ పాటకి సాహిత్యం ప్రవీణ్ మాచవరం (Praveen Kumar Machavaram), గాత్రం జనార్దన్ పన్నెల (Janardhan Pannela), స్ఫూర్తి జితేందర్ (Spoorthi Yadagiri), సంగీతం సుధా శ్రీనివాస్ పెరంబుదూరి (Sudha Srinivas Perambuduri) మరియు నృత్యం నాగ దుర్గ (Nagha Durga).

పన్నెల క్రియేషన్స్ (Pannela Creations) యూట్యూబ్ ఛానెల్ లో విడుదలైన “సక్క సక్కని పూల సుక్క” పాటని పై వీడియోలో చూడవచ్చు. జనార్దన్ పన్నెల గత నెలలో రిలీజ్ చేసిన ‘గం గం గణనాథ..’ పాట కూడా బహు ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected