Connect with us

Telugu Desam Party

చంద్రబాబుకి సంఘీభావంగా రిలే నిరాహార దీక్ష @ Chicago

Published

on

చికాగో నగరంలో చంద్రబాబుకి మద్దతుగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రిలే నిరాహారదీక్షలో ఒక రోజు పాటు కూర్చున్నారు. పార్టీలకు అతీతంగా మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ కూడా పాల్గొని దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా పలు వక్తలు మాట్లాడుతూ.. బాబుగారి హయాంలో ఐటీ అభివృద్ధి తో పాటు తమ అందరూ అమెరికా రావడానికి ఆయన ఎలా కారణమయ్యారో గుర్తు తెచ్చుకొన్నారు. లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి, వేలల్లో యువతకు ఉద్యోగాలు కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరగడం అనేది ఒక పసలేని ఆధారాలు లేని కేసు అన్నారు.

కేవలం వ్యక్తి గత కక్షల కోసం వ్యవస్థలను బ్రస్థు పట్టించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటు అని అన్నారు. చివరిగా యుగంధర్ యడ్లపాటి చేతుల మీదగా నిమ్మరసంతో దీక్షని విరమింప చేశారు.

చంద్రబాబు అరెస్ట్ అయ్యిన దగ్గర నుంచి ఆందోళన చెందిన అభిమానులు లోకల్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకత్వం అధ్వర్యంలో వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూనే వున్నారు. జనసేన అభిమానులు కూడా వచ్చి దీక్షకు మద్దతు తెలిపారు.

రిలే నిరాహార దీక్షలో హేమ కానూరు, రవి కాకర, హను చెరుకూరి, విజయ్ కోరపాటి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి, మహేష్ కాకరాల, మూర్తి కొప్పాక, సతీష్ వీరపనేని, వినోజ్ చనుమోలు, మురళి కలగార, సతీష్ యలమంచిలి, అశోక్ పరుచూరి, శ్రీహర్ష గరికిపాటి, శివ, మహేష్, త్రివేది, శశి, ప్రకాష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected