Connect with us

Competitions

NATS రంగోలి పోటీలు; సృజనాత్మకతను ప్రదర్శించిన మహిళలు @ Cary, Charlotte, North Carolina

Published

on

అమెరికాలోని North Carolina లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) నాట్స్ తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రం లోని కారీ (Cary) లో సాయి మందిరంతో పాటు షార్లెట్లో (Charlotte) ని శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిరంలో రంగోలీ (Rangoli) పోటీలు జనవరి 19 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.

సంక్రాంతి సంబరాల్లో (Sankranti Celebrations) భాగంగా నాట్స్ నార్త్ కరోలినా (NATS North Carolina Chapter) విభాగం ఈ రంగోలి పోటీలను నిర్వహించింది. నార్త్ కరోలినా లోని తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించి.. తెలుగు సంప్రదాయలను ప్రతిబింబించే ఎన్నో ముగ్గులు వేశారు.

ఈ ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా ఉన్న నాలుగింటిని ఎంపిక చేసి.. వాటిని వేసిన మహిళలకు నాట్స్ బహుమతులు పంపిణి చేసింది. నాట్స్ నార్త్ కరోలినా (NATS North Carolina Chapter) మహిళా నాయకత్వం ఈ రంగోలి పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాట్స్ (NATS) అభినందించింది.

ఈ రంగోలి పోటీలను (Rangoli Competitions) చక్కగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected