ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి ఆశ్రమానికి చెందిన అనాధలు, దివ్యాంగుల పిల్లలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వీరవల్లి సర్పంచ్ పిల్లా అనిత, స్థానిక ప్రముఖులు అవిర్నేని శేషగిరి, కలపాల రాజాబాబు, పిల్లా రామారావు, యలమంచిలి మూర్తి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి సహకారంతో వారి సూచనల మేరకు దివ్యాంగుల పిల్లలకు, అనాధులకు పంపిణీ చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారని వారి సేవలు మన అందరికి స్ఫూర్తిదాయకమని సర్పంచ్ పిల్లా అనిత అన్నారు.
జనవరి 5 గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శీతాకాలంలో ఉపయోగపడే దుప్పట్లు, రగ్గులు ఇచ్చినందుకు వికలాంగులు మరియు వసతి గృహ నిర్వాహకులు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.