వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్ థెరిస్సా (Mother Teresa) స్ఫూర్తిగా వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇచ్చింది. విశ్వాసమే నా బలం సేవే నా ఆయుధం గా ముందుకు సాగుతున్నానన్నారు సంఘసేవలో రాజాధి రాజా.. రాజా కసుకుర్తి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి గ్రామ వాసి అయిన రాజా ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.సౌమ్యునిగా, కాంట్రావర్సీలకు దూరంగా ఉండే వ్యక్తిగా రాజా కసుకుర్తి న్యూ జెర్సీ (New Jersey) వాసులకు సుపరిచయం.
రాజా (Raja Kasukurthi) ప్రస్తుత తానా ఎన్నికల్లో తానా సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో తానా సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయకర్తగా, న్యూ జెర్సీతానా రీజినల్ కో ఆర్డినేటర్ గా, అంతకు ముందు తానా (Telugu Association of North America) బ్యాక్ ప్యాక్ కో చైర్ గా విశేషమైన సేవలందించారు.
ఇండియాలో మెగా హెల్త్ క్యాంపుల (Health Camps) నిర్వహణ, పాఠశాలల అభివృద్ధి, రోడ్లు విద్యుత్ విద్యా సౌకర్యాల మెరుగు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సహాయం, ఏపి జన్మభూమి కార్యక్రమంలో 50 డిజిటల్ తరగతి (Digital Classes) గదులకు సహాయం, అమెరికాలోనూ ఇండియాలోనూ వేలాది మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్ లు, పాఠశాల సామాగ్రి పంపిణీ చేశారు. అమెరికాలో సీపీఆర్ శిక్షణా (CPR Training) శిబిరాలు నిర్వహించారు.
తానా 5కె రన్ సంక్రాంతి సంబరాలు, వాలీబాల్ పోటీలు, ఫుడ్ డొనేషన్, తానా చైతన్య స్రవంతిలో (Chaitanya Sravanti) మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, వ్యవసాయదారులకు రైతు రక్షణ కిట్లు, పవర్ స్ప్రేయర్ల పంపిణీ, యోగా ధ్యాన శిబిరాలు, స్థానిక ఆహార కేంద్రాలకు విరాళాలు, అష్టావధానం, ఘంటసాల వర్ధంతి వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు.
మనం ఎంతగానో ఎదగడానికి సహకరించిన మరియు మన చుట్టూ ఉన్న వాళ్లకి మన సమాజానికి తిరిగి ప్రత్యుపకారం చేయాలి అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలలో ఉన్న గ్రామాల ప్రగతికి రాజా కసుకుర్తి కృషి చేశారు. పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు అందించడానికి విరాళాల సేకరణ చేశారు.
వివిధ రంగాలపై సదస్సులు, కోవిడ్ (COVID) మహమ్మారి సమయంలో ఆంధ్ర తెలంగాణాల్లోని వేలాది పేద ప్రజలకు భోజనం నిత్యావసర వస్తువులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫుడ్ ప్యాకెట్లు, అనాధ ఆశ్రమాలు, పాఠశాలలలోని పిల్లల కోసం దుప్పట్లు, ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, పోలీసులకు & ప్రజలకు హెల్మెట్ల విరాళం మరియు పిల్లలకు తానా వేసవి శిక్షణా శిబిరం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామన్నారు.
“రైతు బిడ్డగా కష్టాలు తెలిసినవాడిని. ప్రొఫెషనల్ గా సమస్యలు పరిష్కరించడంలో అనుభవం ఉన్నవాడిని. సేవ చేయడంలో సేవను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండేవాడిని. తానా కార్యదర్శి (Secretary) గా గెలిపిస్తే మరింత బాధ్యతగా ఓ సేవకునిగా ఓ మిత్రునిగా అందరితో ఉంటూ కమ్యూనిటి సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తామన్నారు” రాజా కసుకుర్తి.
దశాబ్దాల తానా (TANA) లో ఓ చిరు కార్యకర్తగా ప్రవేశించి నేడు నాయకత్వ బాధ్యతల్లో ఉన్నానంటే అదంతా మీరు నాపై చూపిన అభిమానమే. ఆ అభిమానాన్ని, ప్రేమను కాపాడుకుంటూ మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా సంకల్పానికి మీరు మరింత ప్రోత్సాహాన్ని అందించి కార్యదర్శిగా గెలిపిస్తే తానా సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళుతానని అన్నారు.
అమెరికాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా రైతులను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి రాజా కసుకుర్తి. తానా ద్వారా రైతులకోసం ఎన్నో కార్యక్రమాలను చేశారు. రైతులకోసం ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సను అందించారు. రైతులకురక్షణ కిట్లు, పవర్ స్ప్రేయర్లు, గడ్డి కోసే యంత్రాలు, పాడి పరిశ్రమకు వ్యవసాయ ఆధునిక యంత్రాలు ఇచ్చి వారి కష్టాలను తుడిచే ప్రయత్నం చేస్తున్నారు రాజా కసుకుర్తి.
“చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరికీ సేవలందించాను. అమెరికా అంతటా విస్తరించిన తానా (TANA) సభ్యులందరితో కలిసి ప్రయాణం చేశాను. వేలాదిమంది సభ్యులు ఉన్న తానాలో సమస్యలు వచ్చినా పరిష్కారాలకు నావంతుగా కృషి చేస్తాను. అందరివాడిగా ఉంటాను. అందరితో కలిసి సేవ చేస్తాను. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను” అని అన్నారు.
తానా (TANA) ఎన్నికల్లో తనతోపాటు టీం కొడాలి ప్యానెల్ (Team Kodali) లోని ప్రతి ఒక్కరికీ మీ అమూల్యమైన ఓటు వేసి మరింత సేవ చేసే అవకాశాన్ని ఇచ్చేలా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నారు రాజా కసుకుర్తి. తానా లో ముఖ్యమైన కార్యదర్శి పదవికి తెలుగువారికి చేదోడు వాదోడుగా ఉండే రాజా కసుకుర్తి లాంటి వారే తగిన వారని తానా సభ్యులు (TANA Members) కూడా తలంచడం మంచి పరిణామం.