తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్ర సంస్థ తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి ఆర్థిక సహకారంతో ఈ సేవాకార్యక్రమం నిర్వహించారు.
150 మంది వృద్ధులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. చలికాలంలో పేదలకు సహాయం చేయడానికి సహకరించిన తానా నాయకత్వానికి మరియు రాజా కసుకుర్తి కి తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తణుకు, వేల్పూరు గ్రామ నాయకులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు ఈ సహాయ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆనందంగా వెనుదిరిగారు. స్థానిక నాయకులు, ఆరిమిల్లి రాధాకృష్ణ (ARK) ఫ్రెండ్స్ తదితరులు ఈ సేవాకార్యక్రమంలో పాలుపంచుకున్నారు.