Connect with us

Politics

NRI TDP Milwaukee ఆధ్వర్యంలో విజయవంతంగా ‘రా కదలిరా’

Published

on

NRI TDP Milwaukee Chapter ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు NRI టీడీపీ Milwaukee వారు, Milwaukee సిటీ, Wisconsin State (USA) లో ‘రా కదలిరా’ ప్రోగ్రాం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది వక్తలు వివిధ రకాలుగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి మరియు ఆంధ్ర (Andhra Pradesh) రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం అని చెప్పడం జరిగినది. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

ఈ ప్రోగ్రామ్ కి zoom మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు తెలుగుదేశం నాయకులు వారి వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. ఈ zoom మీటింగ్ లో శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, శ్రీ రెడ్డప్పరెడ్డి గారి శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ గౌతు శిరీషా గారు మరియు పంతంగాని నరసింహప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది.

కావున వారందరికీ NRI TDP Milwaukee Chapter తరుపున ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది. భోజనాల అనంతరం వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected