Connect with us

Festivals

ఘనంగా ఖతార్ తెలంగాణ ప్రజా సమితి ఉగాది సంబరాలు @ Doha, Qatar

Published

on

ఖతార్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 18, శనివారం సాయంత్రం స్థానిక లయోల ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ నేతృత్వంలో ప్రవాసి కుటుంబాలు మరియు కార్మికులు కలిసి ఆనందగా పండగ వేడుకల్లో పాల్గొన్నారు.

ఖండాంతరాల్లో ఉన్నా, తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను మరవకుండా ప్రతి పండగను మరిచిపోకుండా భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రజా సమితి – దోహా ఖతార్ ప్రతి పండగను ఘనంగా నిర్వహిస్తుంది.

అందులో భాగంగానే ఈ ఏడూ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరపడానికి ముందుకొచ్చి తెలుగు చలనచిత్ర గాయని గాయకులను మరియు టెలివిజన్ రంగంలోని ప్రముఖ కళాకారులను ఆహ్వానించి ఆహుతులకు మధురానుభూతిని పంచింది తెలంగాణ ప్రజా సమితి ఖతార్.

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా పండగ జరుపుకున్నారు. సుమారు 1000 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వేడుకల్ని తిలకించి సంప్రదాయ పండుగ సంబరాలను అతిథుల మద్య ఆనందంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిథులందరిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించి మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గ సభ్యులు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను అలరించిన కళాకారులను అతిథులందరి సమక్షంలో తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గ పక్షాన అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ గారి నేతృత్వంలో సన్మానించడం జరిగింది. ఈ వేడుకలకు ప్రధాన కర్తగా వ్యవహరించిన తెలంగాణ పుడ్ స్టఫ్ అధినేత ప్రవీణ్ కుమార్ బుయ్యని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించారు నిర్వాహకులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected