Connect with us

Financial Assistance

చంద్రబాబుతో Qatar NRI TDP నాయకులు భేటీ, పార్టీకి 15.5 లక్షల విరాళం

Published

on

ఖతార్ లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ (QATAR NRI TDP) నాయకులు స్వదేశానికి వెళ్ళి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ప్రశంసిస్తూ తమ మద్దతు తెలిపారు.

అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ నిధికి 10 లక్షల రూపాయలను, వైద్య సహాయార్థం 5.5 లక్షలు ( పార్టీ ఆఫీసుకి అర్జీలు పెట్టుకున్న 15 మందికి 15 చెక్కులు రూపంలో) అధినేత చంద్రబాబుకు ఖతార్ ఎన్ ఆర్ ఐ టిడిపి అధ్యక్షుడు గొట్టిపాటి రమణ, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్ నేతృత్వంలోని ప్రవాసీ ప్రతినిధి బృందం అందించింది.

ఈ కార్యాక్రమానికి ఖతార్ నుండి గొట్టిపాటి రమణ ఆయన సతీమణి లక్ష్మి, మద్దిపోటి నరేష్, విజయ్ భాస్కర్ దండ, కొడాలి సుధాకర్ ఆయన సతీమణి, వెంకప్ప భాగవతుల మరియు పలువురు సభ్యులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఫోటోలు దిగారు.

పార్టీ నిధికి మరియు కార్యకర్తల వైద్యసహాయానికి అడిగిన వెంటనే సత్వరం స్పందించి విరాళాల్ని అందించినందుకు చంద్రబాబుతో పాటు సీనియర్ పార్టీ నాయకులు అశోక్ బాబు, పట్టాభి, డాక్టర్. రవి వేమూరి, బుచ్చిరాం ప్రసాద్, చప్పిడి రాజ శేఖర్ ఖతర్ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఖతార్ బృందం తెలియజేసింది.

15.5 లక్షల రూపాయలను పార్టీ నిధికి, తెలుగుదేశం కార్యకర్తల వైద్య సహాయ నిధికి అందించినందుకు ఖతార్ తెలుగుదేశం శాఖ సభ్యులకు పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్ రావు, ఖతార్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected