Connect with us

Education

పురుషోత్తమ చౌదరి ఇలాఖాలో విద్యార్థులకు ఉపకార వేతనాలు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫాండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుదే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. ‘తానా చేయూత’ కార్యక్రమంలో భాగంగా పురుషోత్తమ చౌదరి తన సొంత జిల్లా అనంతపూర్ లో ఈ సేవాకార్యక్రమానికి స్పాన్సర్ చేసారు.

తానా ఫౌండేషన్ సెక్రటరీ శశికాంత్ వల్లేపల్లి తానా చేయూత కార్యక్రమానికి సమన్వయకర్త. డిసెంబర్ 27న అనంతపురంలోని స్థానిక కమ్మ భవనంలో ఈ ఉపకార వేతనాలను అందజేశారు. 33 మంది ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున అందించారు.

ఈ సందర్భంగా పురుషోత్తమ చౌదరి మాట్లాడుతూ తన తండ్రి వెంకట నారాయణప్ప పేరుమీద తానా ద్వారా ఈ సహాయాన్నందిస్తున్నానన్నారు. అలాగే తానా చేస్తున్న అన్ని కార్యక్రమాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో అనంతపూర్ కమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు, మాజీ సాంకేతిక శాఖా మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు & రాష్ట్ర బీజేపీ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ, మాజీ కార్పోరేటర్లు తదితరులు పాల్గొని పురుషోత్తమ చౌదరి ని అలాగే తానా ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected