Connect with us

Politics

టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నల్లగుడ్డలతో నిరసన @ Kuwait

Published

on

ఎన్నారై తెలుగుదేశం కువైట్ (NRI TDP Kuwait) మరియు జనసేన (Janasena) కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ ను కట్టుకుని నిరసన తెలుయచేస్తూ నారా చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియచేసారు.

కువైట్లో ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకులు, జనసైనికులు హాజరై చంద్రబాబుని ప్రభుత్వం వెంటనే విడుదల చేయలని కోరారు. సుప్రీం కోర్టులో అక్టోబరు మూడవ తారీఖున జరగనున్న విచారణలో న్యాయం గెలిచి చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని భగవంతుణ్ణి వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి నాయకులు సుధాకర రావు కుదరవల్లి, నాగేంద్రబాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, విసి సుబ్బారెడ్డి, షేక్ బాషా, దుగ్గి శ్రీను, గాజులపల్లి సుబ్బా రెడ్డి, మహేష్, సుబ్బరాజు, చామర్తి వెంకట రామరాజు, చిన్నా రాజు, నూతేటి సబ్బనరసింహులు , రవి చంద్రా రెడ్డి, చిన్న బాబు గునపాటి, రాము, మహాసేన రాజేష్ రాపాక, తదితరులు పాల్గొన్నారు.

అలాగే జనసేన నాయకులు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు, అంజన్ కుమార్ పగడాల, ఓబులేసు, వెంకటెష్, దండు చంద్ర శేఖర్, ప్రేమ రాయల్, కొమ్మినేని భాలజి, పసుపు లేట్ రాజేష్ శంకర్ భాస్కర్ రాయల చైతు పాగడల పూల సాయి రమేష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected