Connect with us

Government

చంద్రబాబు నాయుడు అరెస్టు పై ప్రవాసుల నిరసన @ Torrance, California

Published

on

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం టొర్రెన్స్ కొలంబియా పార్కు లో ఎన్‌ఆర్‌ఐ లాస్ ఏంజెలెస్ ఆధ్వర్యంలో పార్టీలకు మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రవాసీయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని నినదిస్తూ భారీ సంఖ్యలో CBN అభిమానులు నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.

We are with CBN, NRI’s with CBN, IT people with CBN, We want Justice, “జై బాబు, జై జై బాబు” మరియు సైకో పోవాలి, సైకిల్ రావాలి నినాదాలతో కార్యక్రమం ముందుకు సాగింది. ఈ ధర్నాలో తెలుగుదేశం, జనసేన, రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసులు కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమం లో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం లాస్ ఏంజెలెస్, ఎన్‌ఆర్‌ఐ జనసేన సభ్యులు, మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ సర్కార్ కక్షపూరిత విధానాలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీయులు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected