Connect with us

Politics

మేము సైతం బాబు కోసం కార్యక్రమం @ Birmingham, Alabama

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా Birmingham, Alabama State, USA లో “మేము సైతం.. బాబు కోసం” కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్టాల తెలుగు వారు, మహిళలు, IT నిపుణులు, యువత మరియు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

అసత్య ఆరోపణలతో చంద్రబాబు (Nara Chandrababu Naidu) ని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలుగు ప్రజలు స్పష్టం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌ అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం కక్షపూరిత విధానాలతో పాలన సాగిస్తూ, మాజీ ముఖ్యమంత్రి (Ex Chief Minister) ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.

వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) నియంతృత్వ పోకడలను, కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నిరసన తెలియచేసారు. నారా చంద్రబాబు నాయుడి అరెస్టు తప్పుడు విధానంలో జరిగిందని ఆరోపించారు.

చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ‘న్యాయం కావాలి – చంద్రబాబు విడుదల కావాలి’, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ – సేవ్ డెమోక్రసి’ అంటూ నినాదాలు చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected