Connect with us

Telugu Desam Party

California: జైలు నుంచి వెంటనే విడుదల చేసి, ఫేక్ కేసుని కొట్టివేయాలని బాబుకి సంఘీభావ ర్యాలీ

Published

on

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుదారులతో పాటు రాజకీయ పార్టీలకతీతంగా బే ఏరియా లో ఉంటున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుని ఖండిస్తూ అమెరికాలోని బే ఏరియా లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు.

ఎన్నారై టీడీపీ మరియు ఎన్నారై జనసేన నాయకులు వెంకట్ కోగంటి, గాంధీ పాపినేని, చంద్ర గుంటుపల్లి మరియు వీరబాబు పత్తిపాటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేసి, ఫేక్ కేసుని కొట్టివేయాలని డిమాండ్ చేశారు.

తాము ఈ రోజు అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా చంద్రబాబు చేసిన కృషి వల్లే సాధ్యమైందని నిరసనలో పాల్గొన్న పలువురు ప్రవాసాంధ్రులు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు (Nara Chandrababu Naidu) ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలనే నినాదాలతో బే ఏరియా వీధుల్లో హోరెత్తించారు. ఉయ్ వాంట్ జష్టిస్, ఉయ్ ఆర్ విత్ సీబీఎన్ వంటి నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.

ప్రపంచం కీర్తించిన నాయకుడిని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడిని జైల్లో పెడతారా అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు మరియు ఉద్యోగులు నిలదీశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు తాము కూడా బాబు అండగా ఉద్యమిస్తామని తెలిపారు.

ఎన్నారై తెలుగుదేశం పార్టీ (NRI TDP) మరియు ఎన్నారై జనసేన పార్టీ (NRI Janasena) స్థానిక నాయకులు చక్కటి సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటాన్ని పార్టీలకతీతంగా వచ్చిన వారు అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected