ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్రజాస్వామిక మరియు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 శనివారం రోజున నిరసన కార్యక్రమం చేపట్టారు.
అట్లాంటా (Atlanta) లోని కమ్మింగ్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు స్థానిక మౌంటైన్ రోడ్ లో సమావేశమయ్యారు. ఉయ్ స్టాండ్ విత్ సీబీఎన్ (We Stand With CBN) అంటూ బ్యానర్, ప్లకార్డులు మరియుతెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించారు.
చంద్రబాబు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిద్దాం.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఉయ్ స్టాండ్ విత్ సీబీఎన్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా సాయిరాం సూరపనేని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ ఐ ఆర్ (First Information Report – FIR) లో పేరు లేనప్పటికీ రాజకీయ కక్షతో అరెస్టు చేయడం అన్యాయం మరియు అప్రజాస్వామికం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలవాలన్నారు. సైబరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించి యువతకి ఉద్యోగాలను తెచ్చిన చంద్రబాబు కావాలో లేక అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్ కావాలో ప్రజానీకం తెలుసుకోవాలన్నారు.
మల్లిక్ మేదరమెట్ల మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో లేని కేసులను ఉన్నట్టుగా చిత్రీకరించి గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేని ఒక తుప్పు పట్టిన కేసును తీసుకొని, సీబీఎన్ పెళ్లి వార్షికోత్సవానికి ముందు రోజు అందులో ఇరికించాలని కుట్ర పన్నారన్నారు. ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నామని, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.