Connect with us

Telugu Desam Party

Bloomington-Normal, Illinois: చంద్రబాబుకి సంఘీభావంగా నిరసన

Published

on

ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి , రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా ఆంధ్ర (Andhra Pradesh) పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దశాబ్దాల మచ్చలేని రాజకీయ నాయకుడు, సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబు నాయుడు పై అప్రజాస్వామిక దాడి జరుగుతున్నది.

దీనికి నిరసనగా ఈరోజు సెప్టెంబర్ 25న బ్లూమింగ్టన్ మరియు నార్మల్ ఇల్లినాయిస్ (Bloomington, Illinois Metropolitan Statistical Area) లోని తెలుగుదేశం మరియు చంద్రబాబు అభిమానులు క్లియర్ వాటర్ పార్క్ (Clearwater Park) నందు సమావేశమై చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు.

అనేక మంది వ్యక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు వలన కలిగిన లాభములను వారి వారి అనుభవములు ద్వారా పంచుకొని రాబోవు కాలములో అందరూ ఏకమై చంద్రబాబు (Nara Chandrababu Naidu) ని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని అందరికి విజ్ఞప్తి చేసినారు.

పార్టీలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా చంద్రబాబు (Telugu Desam Party) కి సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన అందరికి, కార్యనిర్వాహకులు ధన్యవాదములు తెలిచేసినారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected