తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంటు కేసంటూ ఒక ఆధారాలు లేని ఆరోపణపై నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి చేసిన అక్రమ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ Wilmington Delaware NRI TDP committee ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా హాజరైన ప్రతినిధులు ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయాలంటే గవర్నరు గారి అనుమతి అవసరం. అది ఎలాగూ పాటించలేదు సరికదా ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా చేసిన నిరంకుశ అరెస్టుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే “పిచ్చోడు లండన్ లో.. మంచోడు జైల్లో“, “చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం“, “సైకో పోవాలి.. సైకిల్ రావాలి“ లాంటి నినాదాలతో ప్రాగణం అంతా మార్మోగించారు. 16 నెలలు జైలులో ఉండి వచ్చి మచ్చలేని చంద్రబాబుకి కూడా ఆ బురద అంటించాలనే కక్షసాధింపులో భాగంగానే ఇటువంటి దుశ్చర్యలని ఉద్ఘాటించారు.
ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షులు సత్య పొన్నగంటి తో పాటు హరి తూబాటి, కిషోర్ కూకలకుంట్ల, సురేష్ పాములపాటి, నవీన్ గంట, దశరథ్, జ్యోతిష్ నాయుడు, గంగాధర్ గుత్తా, చంద్ర పోతినేని, పురాణ గంగూరి, యోగేష్ మరియూ పిల్లలు కూడా పాల్గొని తమ నేతకు సంఘీభావం ప్రకటించి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.