నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానూ నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోసాను
ఈ పాట ఎన్ని సార్లు విన్న, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ రోజు ఈ పాట కి పూర్తి న్యాయం చేశారు నార్త్ కరోలినా, రాలీ లో NRI TDP అభిమానులు. చంద్రబాబు గారి కక్షపూరిత అరెస్ట్ కి నిరసనగా ఈ రోజు నార్త్ కరోలినా, రాలీ లో NRI TDP RTP team వారు నిర్వహించిన కార్యక్రమం లో దగ్గర దగ్గర 500 మంది చంద్రబాబు అభిమానులు పాల్గొని, నల్ల దుస్తులు దరించి ఆయనకి తమ సంఘీబావాన్ని ప్రకటించారు.
We Want Justice, psycho povaali, cycle ravaali, We are with CBN అంటూ వారు చేసిన నినాదాలతో ఆప్రాంతం హోరెత్తిపోయింది. ముఖ్యంగా తెలుగు మహిళలు అశేష సంఖ్యలో అమెరికా లాంటి దేశం లో ఇలాంటి నిరసన కార్యక్రమాల్లో స్వచ్చందం గా, ఒక బాధ్యతతో, పాల్గొనటం, బహుశ ఇదే మొదటి సారేమో.
అది చంద్రబాబు గారి మీద వారికి అంచలంచలుగా ఉన్న అభిమానానికి, విశ్వాసానికి నిదర్సనం. అది ఒక నిజాయితీలో, నిబద్దత లో ఉన్న పవర్. అది అందరికీ అర్ధం కాదు. రోజూ టీవీ లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, హిట్లర్ పాలనని గుర్తుకు తెస్తున్న ఆంధ్ర పాలకుల తీరుని చూసి, ఏమి చెయ్యాలో తెలియని నిస్సహాయత తో, తమలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనని తమ సందేశాలతో తెలియచేశారు.
ఈరోజు ఆ దార్శనికుడిని రాజకీయ కక్షతో, ఎటువంటి ఆధారాలు లేకుండా, అరెస్ట్ చేసిన విధానాన్ని మేమంతా తీవ్రం గా కండిస్తున్నామని, ముక్త కంటం తో నినదించారు. ఇలాంటి కాస్త సమయం లో, బాబు గారికి, వారి కుటుంబానికి, మేము గతాన్ని మర్చిపోలేదు. మీ వెనకే మేమున్నాము, మీతోనే మేముంటాము అని జయ జయ ద్వానాలతో తెలియ చేసారు.
చంద్రబాబు రాష్ట్ర పరజల ఆస్తి, ఆయన్ని కాపాడుకోవటం మనందరి సామాజిక బాధ్యత. చంద్రబాబు అరెస్ట్ అయ్యిన దగ్గర నుంచి ఆందోళన చెందిన అభిమానులు లోకల్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకత్వం అధ్వర్యంలో వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూనే వున్నారు.
ఈ ప్రొటెస్టు విజయవంతం కావడంలో NRI టీడీపీ RTP కార్యవర్గ సభ్యుల గొట్టిపాటి శ్రీధర్ గారు, శ్రీనివాస్ ఆరెమండ, మాధవి ముప్పవరపు, రాజీవ్ తలసీల, నాగరాజు గోంది, సురేష్ చల్లపల్లి, శ్రీనాథ్ కడియాల మరియు రాలీ ఎన్టీఆర్ ఫాన్స్ & టీడీపీ కార్యకర్తలు శ్రీనివాస్ మార్తల, శ్రీని అనంత, శిరీష్ గొట్టిముక్కల, హరీష్ కన్నెగంటి, ప్రవీణ్ పెద్ది, శరత్ కొమ్మెనేని, అనిల్ మద్దినేని, అవినాష్ గోగినేని, కిశోర్ కాట్రగడ్డ, సతీష్ సూరపనేని, బుజ్జి గారు, శ్రీ కొండపనేని, శ్రీకాంత్ యర్రగుంట, రవి వాసిరెడ్డి, బాలకృష్ణ తుమ్మల, రాజేష్ ముమ్మనేని, అవనీంద్ర ప్రసాద్ నాగినేని గారు, కల్పన గొట్టిపాటి, శైలజ కొండ్రగుంట, నిర్మల కోరిపెల్ల, రామా ఈడుపుగంటి, కవిత మాదాల, ఉమా చౌదరి, అనుపమ సూరపనేని, సంజు వెల్లంకి, స్రవంతి రావెళ్ల, మల్లికా మేకపాటి, మమతా దగ్గుపాటి, సరితా అడుసుమిల్లి, చందాన గొట్టిముక్కల, రేణుక గొట్టిముక్కల, శిరీష కరణం, స్మిత చల్లపల్లి, భారతి అడుసుమల్లి, శివాని దోన, రాధిక వల్లూరుపల్లి, నాగజా దేవినేని, కృష్ణ యెల్లూరుల్లి, మాధవి గోగినేని,చైతన్య ఉప్పలపాటి, ప్రియా దాసరి, హరిత కోయ, సుధా త్రిపిర్నేని, శ్రావ్య తదితరులు కీలక పాత్ర పోషించారు. జనసేన అభిమానులు కృష్ణ రెడ్డి గంగిరెడ్డి, నిరంజన్ పుజారా తదితరులు కూడా వచ్చి దీక్షకు మద్దతు తెలిపారు.